హైదరాబాదు నగరాన్ని క్రమబద్దీకరణతో కూడిన ఒక
అధునాతన నగరంగా రూపొందించాలని తెలంగాణా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు చేస్తున్న
ప్రయత్నాలు, రూపొందిస్తున్న ప్రణాళికలు హర్షించదగినవే. ఆహ్వానించదగినవే. తెలంగాణా
రాజధానికి ఇప్పటికే అంతర్జాతీయ గుర్తింపు వుంది. అనేక అంతర్జాతీయ సంస్థలు హైదరాబాదులో తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. గత
అయిదేళ్ళ కాలంలో పరిపాలనా పరంగా ఏర్పడ్డ అనిశ్చితి, ప్రాంతీయ ఉద్యమం కారణంగా
కొనసాగిన అసంగ్దిగ్ధ స్తితి మరికొన్ని విదేశీ సంస్థలు నగర ప్రవేశం చేయడానికి
అడ్డంకిగా మారాయి. ఇప్పుడా పరిస్తితి లేదు. కాకపొతే పెట్టుబడులు భారీగా
పెట్టేందుకు రాష్ట్రానికి వచ్చేవారు అనేక విషయాలు ముందుగా ఆలోచించుకుంటారు.
వాటిల్లో ప్రధానమైనది శాంతిభద్రతల అంశం. బహుశా దీన్ని దృష్టిలో పెట్టుకునే కొత్త
ముఖ్యమంత్రి హైదరాబాదును నేరరహిత నగరంగా తీర్చిదిద్దాలనే ఆలోచన చేస్తున్నట్టుంది.
పోలీసు బలగాల సంఖ్యను పెంచడం, విధులను మరింత వేగంగా సమర్ధంగా నిర్వహించేందుకు
వీలుగా వారికి అవసరమైన అధునాతన సదుపాయాలు కల్పించడం ఇలాటివన్నీ ఆ ఆలోచన నుంచి
పురుడుపోసుకున్నవే. ఈ క్రమంలోనే కాబోలు నగరంలో రోజురోజుకూ విచ్చలవిడిగా
పెరిగిపోతున్న అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాలనే గట్టి నిర్ణయానికి ఆయన
వచ్చినట్టు తోస్తోంది. అయితే దానికి అనుగుణంగా అధికార యంత్రాంగం తలపెట్టిన
కూల్చివేతల కార్యక్రమం రాజకీయ వర్గాల్లోనే కాక సాధారణ ప్రజల్లో కూడా అలజడి
రేపుతోంది. కొందరు దీనికి రాజకీయ ఉద్దేశ్యాలు ఆపాదిస్తుంటే మరికొందరు తొందరపాటు
చర్యగా పరిగణిస్తున్నారు. అయినా ఈ విషయంలో వెనక్కు తగ్గేది లేదని, అక్రమనిర్మాణాలను
ఎట్టి పరిస్తితిలోను అనుమతించేది లేదనీ, హైదరాబాదును అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన
మహా నగరంగా తయారుచేయాలన్న స్వప్నం నిజం చేసుకోవాలంటే అక్రమార్కులపై కొరడా విదల్చక
తప్పదనీ ముఖ్యమంత్రి మరోమారు స్పష్టం చేయడంతో ఈ
విషయంలో ఆయన యెంత పట్టుదలగా
వున్నారో అన్న సంగతి అర్ధం అవుతోంది.
ఉద్దేశ్యం మంచిదే. పెట్టుకున్న లక్ష్యం గొప్పదే.
కానీ ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ఆచరణలో దోవతప్పి మరో బాట పట్టడం కొత్త విషయం
ఏమీ కాదు. యెంత మంచి పధకం అయినా ప్రజల మద్దతు
లేనిదే విజయవంతం కానేరదు. ఈ ఒక్క విషయంలో
ముఖ్యమంత్రి తన పట్టుదలకు కొంత వివేచన జత చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం
అవుతోంది.
నిబంధలలోని లొసుగులను అడ్డం పెట్టుకుని గృహనిర్మాణ రంగంలోని
వ్యాపారస్తులు ఇబ్బడిముబ్బడిగా డబ్బు కొల్లగొడుతున్నారన్న ఆరోపణల్లో వాస్తవం
లేకపోలేదు. అయితే ఈ అక్రమ నిర్మాణాలకు కారణభూతులయిన పెట్టుబడిదార్లు ఇలాంటి
కూల్చివేతల వ్యవహారం వచ్చేసరికి పూర్తిగా రంగం నుంచి తప్పుకుంటారు. అక్రమ
స్థలాల్లో అక్రమ పద్దతుల్లో నిబంధనలను కాలరాసి, డబ్బుకు గడ్డితినే సిబ్బందిని
మామూళ్ళతో వశపరచుకుని సాగించే నిర్మాణాలు కాబట్టి కొంత చవకగా అమ్మే వెసులుబాటు
వారికి సహజంగా వుంటుంది. ఇదిగో ఇక్కడే, దిగువ మధ్య తరగతి ఆదాయ వర్గాలు వారికి శలభాల్లా
చిక్కుతారు. పదిమంది కొంటున్నప్పుడు మనకేమవుతుంది అనే ధీమా, గతంలో ఇలా కొన్న
భవనాలను గత ప్రభుత్వాలు క్రమబద్ధీకరించిన వైనాలు వారిని ఇలాటి నిర్మాణాలను కొనుగోలు
చేయడానికి పురికొల్పుతాయి. జీవిత పర్యంతం కూడబెట్టుకున్న డబ్బు, అదీ చాలకపోతే అప్పోసప్పో
చేసయినాసరే హైదరాబాదు నగరంలో ఒక గూడు అంటూ
ఏర్పాటుచేసుకోగలిగితే ఎప్పటికో అప్పటికి అదే ఓ పెద్ద ఆసరా అవుతుందన్న ఆశా, వారిచేత చేయకూడని ఇలాటి పనులు చేయిస్తాయి.
అందుకే ఇలాటి సందర్భాలలో పూర్తిగా నష్టపోయేది ఈ తరగతి వారే అవుతున్నారు.
హైదరాబాదు నగరంలో ఈ రకంగా నిబంధలకు విరుద్ధంగా
కట్టిన భవనాలు అరవై వేలవరకు వుండవచ్చని ఓ అంచనా. ప్రస్తుత భవన నిర్మాణ వ్యయాన్ని
ప్రామాణికంగా తీసుకుని లెక్కలు వేస్తె ఈ అక్రమ భవనాల మీద పెట్టుబడి
కోట్లరూపాయాల్లో వుంటుంది. వీటిని కూల్చివేయడం అంటే, సిమెంటు, ఇసుక, ఇనుము వంటి ఖరీదయిన నిర్మాణ
సామాగ్రితో పాటు వేలకొద్దీ కార్మికుల శ్రమదమాదులు కూడా వృధా అయినట్టే. ఇక్కడే ఒక
జవాబు దొరకని, దొరకాల్సిన ప్రశ్న తలెత్తుతొంది.
తెలంగాణాను అవినీతిరహిత రాష్ట్రంగా తయారు
చేయాలనే సత్సంకల్పం కలిగిన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు దృష్టి సారించాల్సిన అంశం కూడా ఇదే. ఒక బహుళ అంతస్తుల
భవననిర్మాణం అనేది ఒక్కరాత్రిలోనో లేదా కొన్ని రోజుల్లోనో పూర్తయ్యే వ్యవహారం
కాదు. సంబంధిత అధికారుల కన్నుగప్పి నిర్మాణం సాగించడం కూడా వీలుపడే విషయం కాదు.
కాబట్టి సర్కారు విదిలిస్తున్న మొదటి
కొరడా దెబ్బ పడాల్సింది అక్రమార్కులకు ఏదో రూపంలో సహకరిస్తున్న అధికారులు, వారి
సిబ్బంది మీద. ఇలా వాదించడం అక్రమ నిర్మాణదారులను సమర్ధించడానికి ఎంతమాత్రం కాదు.
కూల్చివేతల భయం కలిగించడం ద్వారా అక్రమనిర్మాణాల జోలికి పోరాదని ఎలాగైతే ప్రజానీకంలోకి
హెచ్చరికలు పంపాలని పాలకులు భావిస్తున్నారో, అలాగే కొందరు అధికారుల మీద రాజీ లేని కఠిన
చర్యలు తీసుకోగలిగితే ఇలాటి అక్రమాలకు శాశ్వితంగా అడ్డుకట్ట వేయడానికి
సాధ్యపడుతుంది. ఇలా చేయడం ద్వారా ప్రభుత్వానికి ఈ విషయంలో వున్న చిత్తశుద్ధి పట్ల
ఎవరికయినా ఏమైనా సందేహాలు వుంటే అవి
నివృత్తి అవుతాయి.
ఇప్పుడు వున్న అక్రమ నిర్మాణాలతో పాటు
ఇప్పటినుంచి నగరంలో ఎక్కడయినా అక్రమ నిర్మాణం జరిగినా లేదా జరుగుతున్నా దానికి
సంబంధించిన సమాచారం నిర్దిష్టంగా అందితే
ముందు ఎలాటి సంకోచం లేకుండా సంబంధిత అధికారులను సస్పెన్షన్ తో
సరిపుచ్చకుండా శాశ్వితంగా ఉద్యోగాలనుంచి తొలగించాలి. అలాగే, ముఖ్యమంత్రి వీలు
చేసుకుని ప్రతిరోజూ ఈ కూల్చివేతల వ్యవహారాన్ని స్వయంగా సమీక్షించాలి. ఎక్కడా ఎలాటి
లొసుగులకు చోటివ్వని రీతిలో అధికారులు వ్యవహరిస్తున్నారని ఆయన నిర్దారించుకోవాలి.
నగరాన్ని సుందరంగా తయారు చేయాలన్న ముఖ్యమంత్రి
అభిలాష పూర్తిగా నెరవేరాలంటే, నగరంలో కూల్చివేతలు జరుగుతున్న ప్రాంతాలలో
ఉన్నతాధికారులు పర్యటించి పరిస్తితులను పరిశీలించాలి. సగం సగం కూల్చిన ఇళ్ళు,
అడ్డదిడ్డంగా కూల్చిన అపార్ట్ మెంట్లు నగరం
నలుమూలలా అలా అందవికారంగా కనబడుతుంటే అది
నగరానికి ఏమాత్రం శోభనివ్వదు.
11 కామెంట్‌లు:
ఉద్దేశ్యం చాలా మంచిదే , కాకపోతే అది అమలు చేసే తీరే అనుమానంగా ఉంది .
స్థలం ఎవడు కబ్జా చేసాడు అన్నది తేల్చి వాడి దగ్గరనుండి పరిహారం రాబట్టి అది కొనుక్కున్నవాల్లకి ఇచ్చేలా ఏర్పాటు చేయాలి .
అది చెయ్యరు , అలా చేస్తే రాజకీయ నాయకులే బయటకి వస్తారు. అందులో వాళ్ళ పార్టి వాళ్ళే ఉంటారేమో .
ఒక్క అంగుళం అలా పాత బస్తి వైపు అడుగు వేసే దమ్ము ఉండదు . వేస్తె ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు కాబట్టి .
అంతే కాని , నాకు ఓట్లు వేయరా మీరు ?? అంటూ రాజ్యాంగ ప్రకారం కక్ష తీర్చుకుంటుంటే సామాన్యులు ని కష్టాలు పాలు చేయడం తప్ప ఏమి లేదు .
:venkat
<< కాబట్టి సర్కారు విదిలిస్తున్న మొదటి కొరడా దెబ్బ పడాల్సింది అక్రమార్కులకు ఏదో రూపంలో సహకరిస్తున్న అధికారులు, వారి సిబ్బంది మీద. ఇలా వాదించడం అక్రమ నిర్మాణదారులను సమర్ధించడానికి ఎంతమాత్రం కాదు. >>
good point అలా చేస్తేనే ప్రభుత్వ చిత్తశుద్ధిని నమ్మవచ్చు. రాబోయే కాలంలో ఇలాంటివి జరుగకుండా ఎంతో కొంత భయం అధికారయంత్రాంగంలో ఉంటుంది. కానీ ప్రస్తుత ప్రభుత్వాలకి - ఓటు బేంక్ రాజకీయంలో ఇది తెలిసినా అంత చిత్తశుద్ధితో నిర్ణయాలు తీసుకునే దమ్ము పాలకులకు ఉండకపోవచ్చు.
"కొందరు దీనికి రాజకీయ ఉద్దేశ్యాలు ఆపాదిస్తుంటే మరికొందరు తొందరపాటు చర్యగా పరిగణిస్తున్నారు"
రాజకీయ ప్రత్యుర్తులు తప్పక రాజకీయ ఉద్దేశ్యాలు ఆపాదిస్తారు. అక్రమ కట్టడాల కూల్చివేతల వల్ల నష్టం జరిగేవారు & తెలంగాణా బద్దశత్రువులు తప్పక తొందరపాటనో మరొటనొ గగ్గోలు పెడుతారు. వాళ్ళు లొల్లి చెయ్యకపోతే ఆశ్చర్యపడాలి కానీ ఇవేవీ ముందు తెలియని విషయాలు కావు.
"పదిమంది కొంటున్నప్పుడు మనకేమవుతుంది అనే ధీమా"
ఇప్పుడు ఆ పది మందినే అడిగితె పోలా, రాద్దాంతం ఎందుకు? ఇది స్వయంకృతాపరాధం. ఎవరు చేసిన పనికి వారు అనుభవించకతప్పదు.
"కాబట్టి సర్కారు విదిలిస్తున్న మొదటి కొరడా దెబ్బ పడాల్సింది అక్రమార్కులకు ఏదో రూపంలో సహకరిస్తున్న అధికారులు, వారి సిబ్బంది మీద"
మొదటి కొరడా పడాల్సింది భూబకాసురాల మీద, అధికారుల మీద కాదు. అయితే లగడపాటి/అక్కినేని/రాఘవేంద్ర రావు లాంటి బడాబాబుల మీద కొరడా ఝలిపిస్తే వారి అడుగులకు మడుగులొత్తె పార్టీలు & మీడియా ఇప్పటి కంటే లక్ష రెట్లు యాగీ చేయడం ఖాయం. మీ లాంటి "శాంతి కాముకులు" ఇలాంటివే బోల్డు టపాలు రాయడం అంతకంటే ఖాయం.
లాలూచీ పడ్డ అధికారులు ఇంకా పదవిలోనే ఉన్నారా ఉన్నా పక్క రాష్ట్రానికి బదిలీ చేయించుకున్నారా అనే విషయాలు. జరగాల్సిన దారుణం జరిగాక వారి మీద ఎలాంటి చర్య తీసుకున్నా ప్రయోజనం ఉందా? దొంగలు పారిపోయిన తరువాత తాళం వేసినట్టు ఉంది.
"సగం సగం కూల్చిన ఇళ్ళు, అడ్డదిడ్డంగా కూల్చిన అపార్ట్ మెంట్లు నగరం నలుమూలలా అలా అందవికారంగా కనబడుతుంటే అది నగరానికి ఏమాత్రం శోభనివ్వదు"
ముందు ఈ మహమ్మారి బారినుండి తప్పించుకోవడం ముఖ్యం. అందం సంగతి తరువాత చూడొచ్చు.
OLD CITY LO DEMOLISH CHESE DHAIRYAM VUNDAAAAAAAAAAAAAAAAAA
పాత బస్తీ జోలి కెళ్తే కచరా గారితో సహా అందర్నీ చీరి చింతకి కడతారు.ఈ వీరాధి వీరులకి యేమి చూపించాలో అది చూపిస్తారు. తమకు వోట్లు వెయ్యని నగర వాసుల మీద వుద్యమ నేత ప్రతాపం చూపిస్తున్నాడు.అతని అభిమాన గణం పులకిస్తున్నది.వుద్యమం వీర లెవెల్లో వున్నప్పుదే వుద్యమ వీరులకి ధరావతులు గల్లంతవదం అనే గతం మర్చిపోయారు కాబోలు! విలీనం ప్రతిపాదన అనే దరిద్రపు లాలూచీ దిక్కుమాలిన కాంగ్రెసుతో చేసుకుని మూజువాణీ వోటు తో తెచ్చుకుని అఘోరించినా వెంట్రుక వాసి మెజారిటీ యే తెలంగాణా ప్రజలు యెందుకు ఇచ్చారు అనేది కొంచెం నెమ్మదిగా ఆలోచిస్తే తెలుస్తుంది.కానీ నెమ్మది తనం అలవాటు లేదుగా, ముందరి రోజుల్లో అదే తేంగాణా ప్రజలు తదుపరి యెన్నికాల్లో మాడు అదరగొట్టే దెబ్బ కొడీతే గానీ తెలిసి రాదేమో - ప్రతి వాడికీ ఆత్మానుభవం అయితే గానీ తత్వం బోధ పడదు.అంటే ప్రతిసారీ మొట్టికాయ తగిలితేనే బొప్పి కట్టాకనే నెప్పి తెలుస్తుంది.
జై గొట్టిముక్కల
ఆపవయ్యా నీ సుద్దపూస కబుర్లు. కవిత ఎందుకు అడ్డుకుంది అని, ఇప్పటి వరకూ వంద సార్లు అడిగినా నీ దగ్గర నుంచి అడిగితే దానికి సమాధానం రాలేదు కానీ . దిక్కుమాలిన నీతులు చెప్పటానికి మాత్రం రెడీ !
ఏ ఆరోజున వీళ్ళంతా ఆమె చుట్టాలని అడ్డుపడిందా ?
OLD CITY LO DEMOLISH CHESE DHAIRYAM VUNNADI.
ఏ ఆరోజున వీళ్ళంతా ఆమె చుట్టాలని అడ్డుపడిందా ?
>>
అప్పుడు కూలిస్తే యెలా?తాము చెయ్యాల్సిన పని వేరే వాళ్లని చెయ్యనివ్వరు బతక నేర్చిన వాళ్ళు,వెనకటికి ఇంటి ముందు నిలబడ్ద బిచ్చగాణ్ణి కోదలు వెళ్లమన్నదని అదెవత్తి చెప్పదానికి, ఈ సారి రా నేను చెప్తాను అని తీరా వాడు ఆశతో వచ్చాక, "నెను చెప్తున్నాను, బిచ్చం లేదు గిచ్చం లేదు, ఫో!" అన్నదట పుణ్యాత్మురాలు ఈవిడ లాంటిదే.
హరిబాబు గారూ, మీకు పాతబస్తీలో కబ్జాదారులు ఎవరో తెలుసా? పోనీ ఎక్కడెక్కడ కబ్జాలు అయ్యాయా చెప్పగలరా?
అజ్ఞాత: కవిత, గాంధీ ఇంకెవరో అడ్డుకున్నంత మాత్రాన అక్రమం సక్రమం కాదు. వాళ్ళందరి తరఫున జవాబు చెప్పాల్సిన అవసరం నాకయితే లేదు.
@జై,
మీకు ఇంకేమి పని లేదా? ఆంధ్రావాళ్ల బ్లాగులో కామేంట్లు రాయటం తప్పించి. మీ తెలంగాణా వారు ఒక తెలంగాణా మాలిక,తెలంగాణా కూడలి పెట్టుకొని అక్కడ ఆంధ్రావాళ్లన్ని పగలురాత్రి 24X7X365 తిట్టుకోండి. తెలంగాణా ముఖ్యమంత్రి మధ్యతరగతి వాళ్ల ఇళ్లు కూలుస్తున్నారంటే అది ఎందుకో తెలియని అమాయకులు బ్లాగులోకంలో ఎవరు లేరు. మాకు మీరిచ్చే క్లారిటి మడిచి మీ దగ్గరే పెట్టుకొండి.
@జై గొట్టిముక్కల
సమాధానం చెప్పటం చేతకాకపోతే పచ్చ చొక్కాలు అని బ్లాగుల మీద పడి ఏడువుడు ఎందుకు . నీ పింక్ కళ్ళకి కవితక్క , కెసిఆర్ ఏమి చేసినా సక్రమమే . అంతోటి పింక్ కళ్ళతో నువ్వు ఇంకొకళ్ళని లెక్కలు, తొక్కలు, పేర్లు అడుగుడు . పచ్చచొక్కాల లెక్క తీస్తే నీ బాసే ముందు వరసలో ఉంటాడు . కొడుక్కి పేరు దొరక్క అది కూడా కబ్జానే . నువ్వు మళ్లీ నీతి సూత్రాలు వల్లేవేయటం.
కామెంట్‌ను పోస్ట్ చేయండి