10, జులై 2014, గురువారం

శుభమస్తు!



చిన్నవాడి (సంతోష్) పుట్టినరోజునే మరో తీపి కబురు. పెద్దవాడు (సందీప్) మరింత పెద్దవాడయ్యాడని. అంటే  ఉద్యోగంలో మరో మెట్టు పైకెక్కాడని. అమెరికాలో వుంటూ ఇన్ఫోసిస్ లో పనిచేస్తున్న సందీప్ నిన్న సాయంత్రం ఫోను చేసి చెప్పాడీకబురు.



ఒకరి మీద ఆధారపడకుండా చదువుకున్నారు. అలాగే సొంతంగా ఉద్యోగాలు తెచ్చుకున్నారు. వారికి చెప్పమనీ వీరికి చెప్పమనీ ఏనాడు అడగలేదు. అడిగినా చేస్తానన్న నమ్మకం లేదేమో. అదే మంచిదయింది. అయితే ఓ సలహా. దేవుడు మనకొక మంచి అవకాశం ఇస్తున్నాడంటే దాని  అర్ధం  అవసరంలో వున్నవారికి ఏదయినా మనద్వారా చేయించాలని. అంతే నేను చెప్పేది.          

5 కామెంట్‌లు:

Jai Gottimukkala చెప్పారు...

Congratulations to Sandeep garu.

మీకు ఎవరికీ చెప్పడం ఇష్టం కాదని తెలుస్తూనే ఉంది. అది మీ సద్గుణం. అలాంటి మనస్తత్వం వల్లే అంతంత పెద్ద పదవులలో ఉన్నవారికి మీమీద గురి.

మీ పిల్లలు తమ సొంత మేధస్సు మరియు కృషితో పైకొచ్చి తండ్రికి తగ్గ తనయులు అనిపించుకున్నారు. Hats off to you & to them sir.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@Jai Gottimukkala - Very many thanks for your kind compliments - Bhandaru Srinivas Rao

అజ్ఞాత చెప్పారు...

congrates

అజ్ఞాత చెప్పారు...

bsr gaaru mee vyakhalu naakentho istham. teluguloo sandesam pampadamelaog teliyadu. dayachesi chepparuuu!

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@అజ్ఞాత - ధన్యవాదాలు. గూగుల్ తెలుగు ప్రయత్నించండి.-భండారు శ్రీనివాసరావు