పుణ్యమూర్తి పుట్టినరోజు
కొందరికి అమ్మ. మరికొందరికి అత్తయ్య. ఇంకొందరికి బామ్మ. ఎందరెందరికో అమ్ముమ్మ. ఆమే మా అమ్మ,
కీర్తిశేషులు భండారు వెంకట్రావమ్మ. ఈరోజు ఆ పుణ్యమూర్తి పుట్టినరోజు. మా అందరి గుండెల్లో ఆమె ఇంకా జీవించే వుంది. అంచేత ఆమెకు
మేము జయంతులు జరపం. ఏటా పుట్టిన రోజులే.
కృష్ణాజిల్లా జగ్గయ్యపేట తాలూకా గండ్రాయిలో పుట్టి
అదే జిల్లా లోని మరో కుగ్రామం కంభంపాడును మెట్టి రాఘవరావుగారి అర్ధాంగిగా ఏడుగురు
ఆడపిల్లలకి, నలుగురు మొగపిల్లలకు తల్లయి, అత్త పాత్రలో కూడా తల్లి ప్రేమనే
పంచి, భండారు వంశాంకురాలను కుల, మత, జాతి,
ప్రాంతీయ భేదాలకు అతీతంగా విశ్వవ్యాప్తం చేసిన మహనీయురాలు. మా పెద్దన్నయ్య కీర్తిశేషులు
భండారు పర్వతాలరావు గారు 1972
లో పూనుకుని చేసిన మా అమ్మ ‘సహస్ర చంద్రదర్శనం’ కార్యక్రమానికి పిల్లాజెల్లా అందరూ దేశవిదేశాలనుంచి తరలి వచ్చి
ఆమె ఆశీస్సులు స్వీకరించి వెళ్ళిన శుభ సందర్భం ఇప్పటికీ మా అందరి మనస్సులో పదిలంగా
వుంది.
పుణ్యలోకాలలో వున్న ఆమె ఆశీస్సులు
ఇప్పటిమాదిరిగానే ఎప్పటికీ అందరికీ లభిస్తూ వుండాలని కోరుకుంటూ – భండారు కుటుంబం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి