12, నవంబర్ 2013, మంగళవారం

బ్రాడ్ కాస్టింగ్ డే

జర్నలిస్ట్ డైరీ సతీష్ బాబు గురించి చెప్పాల్సిన పని లేదు. అలాగే రేడియో గురించి తెలియని వాళ్లు లేరు.
ఈ రెంటికీ లింకేమిటంటారా ? పై లింకే!



ఈరోజు  అంతర్జాతీయ ప్రసార దినోత్సవం (బ్రాడ్ కాస్టింగ్ డే). ‘ఏదీ రేడియో!’ అంటూ తనదయిన శైలిలో చురకలు అంటిస్తూ అలనాటి పాత రోజుల్ని రీవైండ్ చేస్తూ టీవీ -9  లో నిరుడు ఇదే రోజు అందించిన రేడియో కధ ఇది. మరీ పెద్దదేమీ కాదు.  రేడియో వార్తల మాదిరిగా అయిదే అయిదు నిమిషాల్లో హాయిగా వినేయొచ్చు. రేడియో ప్రియులందరికీ నచ్చుతుందని నా హామీ. వింటారు కదూ. సారీ కంటారు కదూ. (టీవీ కదా!) -  భండారు శ్రీనివాసరావు   (12-11-2013)

4 కామెంట్‌లు:

Ravi Khandavilly చెప్పారు...

Good one. Radio always fascinated me. I bought Bose music system just for radio part of it for better clarity, in Chennai. The moment we bought and started listening telugu programs that get aired for an hour everyday, we were invited from AIR for their live music program for Diwali. Because of that I could attend a great musical night and also visit AIR recording studio.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@Ravi Khandavilly - Thanks

Saahitya Abhimaani చెప్పారు...

"..(టీవీ కదా!)..."

భలే చురక వేశారు.

Saahitya Abhimaani చెప్పారు...

టి వి 9 లో నేను చూసే ఏకైక కార్యక్రమం ఎవరిగోల వాడిది. అది కాక మరొక మంచి కార్యక్రమాన్ని గురించి తెలియచేసినందుకు ధన్యవాదాలు. మీరిచ్చిన లింకులో కనపడిన కార్యక్రమంలో, స్వాతంత్ర్య పోరాట సమయంలో, రేడియో ఆ పోరాటానికి ఎంతో సహాయపడింది అన్న అర్ధం వచ్చేట్టుగా ఫొటోలు మాటలు ఉన్నాయి. ఇది నిజమా! అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం చేతిలోనే కదా రేడియో ఉన్నది. స్వాతంత్ర్య పోరాటానికి ప్రచారాన్నిచ్చిన రేడియో ఏది? "స్వాతంత్ర్య పోరాటంలో రేడియో పాత్ర" అన్న విషయం మీద ఒక మంచి వ్యాసం మీరు వ్రాస్తే ఎంతైనా బాగుంటుందని నా అభిప్రాయం. లేదంటే మీ మితృడికి చెప్పి, జర్నలిస్ట్ డైరీలో ఈ విషయం మీద రాబొయ్యే సంవత్సరం బ్రాడ్‌కాస్టింగ్ డే రోజున ప్రసారం చేస్తే ఎంతయినా బాగుంటుందని నా అభిప్రాయం.