అన్న ప్రశ్నకు టెలివిజన్ రంగంలో
నిష్ణాతులయిన తోట భావనారాయణ గారు సవివరమైన సమాధానం ఇచ్చారు. నలుగురూ
తెలుసుకోవాల్సిన విషయాలు ఇందులో వున్నాయన్న ఉద్దేశ్యంతో, ఆయనతో నాకున్న పరిచయాన్ని
ఉపయోగించుకుని ఆయన రాసిన ఈ వ్యాసాన్ని
ఇక్కడ పొందుపరుస్తున్నాను. దీనిపై ‘కాపీ రైట్లు’, ‘కాపీ కొట్టే రైట్లు’ సమస్తం ఆయనవే.
(శ్రీ తోట భావనారాయణ)
భారతదేశంలో రేటింగ్స్
A.C. Nielsen ఆధ్వర్యంలో ఏర్పాటయిన IMRB సంస్థ TAM (Television
Audience Measurement) పేరుతో రేటింగ్స్ నివేదిక రూపొందిస్తుండగా ORG MARG సంస్థ INTAM(Indian National
Television Audience Measurement) పేరుతో రేటింగ్స్ నిర్ణయించడం
మొదలెట్టింది. దీంతో భారతదేశంలో TAM, INTAM నివేదికలు రెండూ వాడకంలోకి వచ్చాయి. TAM మొదట్లో డైరీ పద్ధతిలో
రేటింగ్స్ నిర్ణయించేది. INTAM వాడుతున్న
అత్యాధునికమైన Picture Making Technology ప్రస్తుతం 9 దేశాలకు
విస్తరించింది. ఈ విధానంలో నిమిష నిమిషానికీ ప్రేక్షకులు ఒక కార్యక్రమం నుంచి మరో
కార్యక్రమానికి మారుతున్నా ఆ విషయం స్పష్టంగా నమోదవుతుంది. భారతదేశంలోని 49 నగరాలకు విస్తరించిన INTAM క్రమంగా తన పరిధి
పెంచుకుంటూ వచ్చింది. Picture Making విధానం ఉండటం వలన కేబుల్ ఆపరేటర్లు ఛానల్స్ వరుస
క్రమాన్ని మాటిమాటికీ మార్చినప్పుడు కూడా ఛానల్స్ వారీగా వివరాలు ఖచ్చితంగా
నమోదు చేయటం సాధ్యమవుతుంది. ఈ వివరాలన్నింటినీ TVPointer పేరుతో ప్రత్యేకంగా
రూపొందించిన సాఫ్ట్ వేర్ రూపంలో చందాదారులకు అందజేయటం INTAM కున్న మరో విశిష్టత.
అయితే TAM, INTAM రేటింగ్స్ లో దేన్ని
ప్రామాణికంగా తీసుకోవాలనే విషయంలో సందిగ్ధత, వివాదం కొనసాగుతూ
వచ్చాయి. రెండూ తమ శాంపిల్ సైజ్ ఇంకా పెంచుకోవాలన్నది Indian Broadcasting
Foundation (IBF) అభిప్రాయం.
టీవీ పరిశ్రమ కష్టనష్టాలను సమీక్షించుకునేందుకు ఏర్పాటు చేసుకున్న IBF సంస్థ TAM, INTAM రెండూ సమగ్రమైన
రేటింగ్స్ ఇవ్వలేకపోతున్నాయని అసంతృప్తి వ్యక్తంచేస్తూ వచ్చింది. లెక్కింపులో
అనుసరించాల్సిన సాంకేతిక ప్రమాణాల విషయంలో కూడా ఈ రెండు సంస్థల్లో సారూప్యం
కొరవడిందనే అభిప్రాయం ఉంది. చెరో విధానం అవలంబించడం వలన అనవసరమైన గందరగోళం
ఏర్పడిందన్న భావం పెరిగింది.
భారత్ వంటి పెద్ద దేశంలో వైవిధ్యం ఎక్కువ
ఉండటం వలన శాంపిల్ సైజ్ కూడా ఎక్కువగా ఉన్నప్పుడే అన్ని వర్గాలకూ ప్రాతినిధ్యం
కల్పించినట్లవుతుంది. అప్పుడే అర్థవంతమైన రేటింగ్స్ నిర్ణయించడం కుదురుతుంది.
పెద్ద పెద్ద నగరాలలో కూడా శాంపిల్ సైజ్ చాలా చిన్నదిగా ఉండటం ఇప్పటికీ సమస్యగానే
మిగిలిపోయింది. పైగా హిందీ మాట్లాడే రాష్ట్రాలకున్న ప్రాధాన్యం తూర్పున ఉన్న
రాష్ట్రాలకు లేదు. దేశంలో చాలా ప్రాంతాలకు ఇప్పటికీ ప్రాతినిధ్యం లేదు. రాజస్థాన్, హర్యానా, ఒరిస్సాతో పాటు ఈశాన్య
రాష్ట్రాలను పట్టించుకోలేదు.
అయితే ప్రభుత్వ అంచనాల ప్రకారం
భారతదేశంలోని పట్టణ ప్రాంతాల్లో టీవీ ప్రేక్షకులు సంఖ్య 30 కోట్ల మంది. వారిలో
కేబుల్, శాటిలైట్
ప్రసారాలు చూసే వారి సంఖ్య 22 కోట్ల మంది. అంటే ఈ రెండు సంస్థలూ ఇంకా
పూర్తిస్థాయిలో విస్తరించలేదు అన్నది సుస్పష్టం. ఈ రెండు సంస్థలను
పర్యవేక్షించేందుకు ఒక వ్యవస్థ ఉండాలని ఛానల్ యజమానులు కోరుతూ వచ్చారు. కనీసం 75 శాతం మంది ప్రజలను
సర్వే పరిధిలోకి తీసుకురావటం, పొరపాట్లు సరిదిద్దడం, అటు యాడ్ ఏజెన్సీలూ, ఇటు ఛానల్ యజమానులూ
కలిసికట్టుగా ఉండి ఒకే విధమైన రేటింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకు వచ్చేలా చేయటం
ధ్యేయాలుగా ఉండాలని IBF వాదిస్తూ
వచ్చింది. విచిత్రమైన పరిస్థితి ఏంటంటే TAM, INTAM రెండూ పోటీ సంస్థలుగా
కనిపిస్తున్నప్పటికీ డచ్ సంస్థ VNU కు TAM రేటింగ్స్ నడిపే AC NIELSEN లోనూ, INTAM రేటింగ్స్ ఇచ్చే ORG MARG లోనూ మెజారిటీ వాటా
ఉంది. మొత్తమ్మీద INDIAN BROADCASITING FOUNDATION పట్టుబట్టడంతో ఈ రెండు సంస్థలూ కలిసి
పనిచేయటం మొదలయింది. ఫలితంగా ఇప్పుడు మనకు TAM రేటింగ్స్ మాత్రం
మిగిలాయి.
TAM ప్రతివారం సేకరించిన
డేటాను విశ్లేషించి, మార్కెట్లో
ఏ ఛానల్ వాటా ఎంత ఉందో తేల్చిచెబుతుంది. ఇందులో వాస్తవం ఎంత అనే విషయంలో
భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ అన్ని ఛానల్స్ ఈ డేటాను ఆమోదించి తీరాల్సిందే. అందరూ
అంగీకరించి చందా కట్టడం వల్ల TAM ఇచ్చే నివేదిక మీద
అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం లేదు. పైగా అడ్వర్టయిజింగ్ ఏజెన్సీలు కూడా TAM నివేదిక ఆధారంగా
ప్రకటనలు ఏ మేరకు ఇవ్వాలో నిర్ణయం తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రేటింగ్స్ పరిధి
విస్తరించాలని మాత్రమే అందరూ కోరుకుంటున్నారు. (ఇంకావుంది)
1 కామెంట్:
When we are using DTH, how can they record what we are watching(because what you own is receiver not transmitter ? I have doubt about it. Can you explain this?
కామెంట్‌ను పోస్ట్ చేయండి