‘అంజయ్య గారితో నా అనుభవాలు’ చదివిన ఆకాశవాణి
పూర్వ సంచాలకులు డాక్టర్ పీ.ఎస్.గోపాలకృష్ణ
మరో జ్ఞాపకాన్ని తట్టిలేపారు.
అంజయ్య గారు
ముఖ్యమంత్రిగా వున్న రోజుల్లో - రాష్ట్రం
వివిధ రంగాల్లో సాధించిన అభివృద్ధిని గురించి ఆకాశవాణి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. దానికి
ముఖ్యమంత్రి సందేశం కూడా జోడిస్తే
బాగుంటుందని రేడియో అధికారులు భావించారు. రికార్డింగ్ యూనిట్ తీసుకుని, అప్పుడు ప్రోగ్రాం ఎక్జిక్యూటివ్ గా
పనిచేస్తున్న గోపాలకృష్ణ, నేనూ కలసి ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళాము. మాటా మంతీ
మధ్య అంజయ్యగారు ఎవర్నో పిలిచి అందరికీ చాయ్ తెమ్మని చెప్పి మళ్ళీ కబుర్లలో
పడిపోయారు. రికార్డింగ్ కూడా పూర్తయింది.
కాని, చాయ్ రాలేదని గ్రహించిన
అంజయ్యగారు తానే లేచి వెళ్ళి మా అందరికీ ట్రేలో తేనీరు తెచ్చి ఇచ్చారు. ‘ఎలాటి భేషజాలు
లేని ముఖ్యమంత్రిని చూడడం తన సర్వీసులో అదే మొదటిసారి’ అని గోపాలకృష్ణ పదే పదే గుర్తుచేసుకుంటూ వుండేవారు.(08-11-2013)
1 కామెంట్:
అంజయ్య గారి మీద సర్దార్జీ జోకుల లెవెల్లో అప్పట్లో చాలా దుష్ప్రచారం జరిగింది. అంజయ్య గారి గురించిన చాలా మంచి విషయాలు చెప్పి ఆయనను తెలుసుకునే అవసరం, అవకాశం కలిపించినందుకు ధన్యవాదాలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి