గవర్నర్ల వ్యవస్థ మిధ్య పొమ్మన్నారు అలనాడు ఎన్టీ
రామారావు గారు. రాం లాల్ ఉదంతం జ్ఞాపకం వున్నవారికి గవర్నర్ల మీద ఆయనకు యెందుకు అంత ఆగ్రహం అన్నది
అర్ధం అవుతుంది. కానీ ప్రస్తుతం డెబ్బయ్ ఎనిమిదో పడిలో పడ్డ మాజీ పోలీసు బాసు గారు
కే పీ ఎస్ గిల్ గారికి గవర్నర్లతో ఏం గిల్లికజ్జా వున్నదో తెలవదు.
(శ్రీ కేపీఎస్ గిల్ )
‘గవర్నర్లకు పనీ పాడూ ఏమీ వుండదు. వూరికే ఎదురు
చూస్తూ కూర్చోవడం తప్ప’ అనేశారు పోలీసు
బాసుగా వున్నరోజుల్లో ఎన్కౌంటర్ స్పెషలిష్టుగా పేరుమోసిన ఈ సర్దార్జీ. ఆనాటితో ఆగే
తత్వం ఆయనదయితే ఆయన్ని గురించి ఇంతగా చెప్పుకోవాల్సిన పనేంటి?
- See more at: http://www.andhrajyothy.com/node/32485#sthash.1c8X8txL.dpuf
పనేమీ ఉండదు..ఊరికే ఎదురు చూస్తుండాలి
కాంగ్రెస్ ప్రభుత్వం ఆఫర్ చేసింది
అప్పట్లో పైలెట్ స్వయంగా కోరారు
అలాంటి పదవి వద్దని చెప్పేశాను
కేపీఎస్ గిల్ వివాదాస్పద వ్యాఖ్యలు
అసోం హత్యలతో సంబంధం లేదని వివరణ
కాంగ్రెస్ ప్రభుత్వం ఆఫర్ చేసింది
అప్పట్లో పైలెట్ స్వయంగా కోరారు
అలాంటి పదవి వద్దని చెప్పేశాను
కేపీఎస్ గిల్ వివాదాస్పద వ్యాఖ్యలు
అసోం హత్యలతో సంబంధం లేదని వివరణ
గిల్ దొరవారు గవర్నర్లను ఏకంగా ‘వయసుడిగిన వేశ్యలతో’ పోల్చి వార్తల్లోకెక్కారు.
కాకపొతే, వార్తల్లోకి ఎక్కడం అనేది గిల్ మహాశయులవారికి వెన్నతో పెట్టిన విద్య.
యాభయ్యవ పడి దాటిన తరువాత కూడా గిల్ దొరవారికి స్త్రీ చాపల్యం
తగ్గలేదు. ఒక సాయంత్రం సీనియర్ పోలీసు అధికారులు పాల్గొన్న పార్టీలో పీకల దాకా
తాగిన కేపీఎస్ గిల్ ఆ మద్యం మత్తులో ఒక మహిళా ఐ ఏ ఎస్ అధికారిణిని తాకరాని ప్రదేశంలో ఒక చాపు చరిచారు.
రూపన్ బజాజ్ అనే ఆ ఐ.ఏ.ఎస్. మహిళ కూడా ఏమీ తక్కువ తినలేదు. పై అధికారి అని ఏమాత్రం
మొహమాటపడకుండా గిల్ దొరవారిపై పోలీసు కేసు పెట్టింది. లో పెట్టిన ఆ కేసు
ఎనిమిదేళ్ళ తరువాత కానీ ఓ కొలిక్కి రాలేదు. మొత్తం మీద న్యాయస్థానం ఆయన్ని దోషిగా
పరిగణించి రెండు లక్షల రూపాయల జరిమానా, మూడు మాసాల కఠిన కారాగారశిక్ష విధించి
చట్టానికి ఎవ్వరూ అతీతులు కాదు అని నిరూపించింది. కాని దరిమిలా సుప్రీం దాకా సాగిన
ఈ కేసు లో గిల్ గారికి ఓ మేరకు వూరట లభించింది. జైలు శిక్షను రద్దు చేసి జరిమానాతో
సరిపెట్టారు. అయితే ఆ డబ్బును పరిహారంగా తీసుకోవడానికి రూపన్ బజాజ్ అంగీకరించలేదు. దాంతో ఆ డబ్బును ఏదయినా మహిళా స్వచ్చంద సంస్థకు
విరాళంగా ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. (23-11-2013)
2 కామెంట్‌లు:
saar adbhutamaina title. aayana peru Gill. IAS women officer ni gilli vivaadaallo chikkukunnaadu.
A very good caption.
గిల్లనే పేరు పెట్తుకుని ఆ మాత్రం గిల్లకపోతే యెల్లా మాష్టారూ?ఇదివరకటి గిల్లుడేమో గానీ ఇప్పటి గిల్లుడు మాత్రం అదిరింది. నాకు నచ్చింది!
కామెంట్‌ను పోస్ట్ చేయండి