ఏకాంబరానికి అనుమానం
వచ్చిందే తడవుగా డాక్టర్ దగ్గరకు వెళ్లాడు.
‘మా ఆవిడకు చెవుడు
వచ్చిందని నా అనుమానం’ చెప్పాడు డాక్టర్ తో.
‘వోస్ ఇంతేనా! మా పని
చెవుడు నయం చేయడమే’ అన్నాడు డాక్టర్.
‘మా ఆవిడ చెవుడు యెంత ముదిరిందో తెలుసుకునే వీలుందా!’
‘అదేమంత పని. దీనికి చిన్న
టెస్ట్ వుంది. మీరే చేసుకుని మీకు మీరే
నిర్ధారణ చేసుకోవచ్చు’
డాక్టర్ చెప్పిన చిట్కా
విని ఇంటికి వెళ్లాడు ఏకాంబరం. భార్య వంట గదిలో వుంది.
డాక్టర్ చెప్పినట్టు, కాస్త ఆమెకు దూరంగా నిలబడి, ‘ఇవ్వాళ ఏం కూర చేస్తున్నావు’ అని అడిగాడు.
ఏదో గొణుగుతున్నట్టు పెదాలు
కదిలాయి కాని ఆమె దగ్గరనుంచి సమాధానం లేదు.
ఏకాంబరం ఆమెకు మరింత
దగ్గరగా జరిగి ‘ఏం కూర’ అంటూ మళ్ళీ అదే ప్రశ్న వేసాడు. అప్పుడూ ఆమెనుంచి స్పందన
లేదు. ఇంకాస్త దగ్గరకు వెళ్ళి డాక్టర్ చెప్పినట్టే మళ్ళీ అదే అడిగాడు.
ఈసారి ఏకాంబరం భార్య నుంచి ఠకీమని
జవాబు వచ్చింది.
‘ఏం
కూర ఏం కూర అని మూడు సార్లు అడిగారు. వంకాయ కూర అని మూడుసార్లూ నెత్తీ నోరూ కొట్టుకుంటూ చెప్పాను. మీకేదో
చెవుడు వచ్చినట్టుంది. ముందు పోయి ఏ డాక్టర్ కన్నా చూపించుకోండి’
(నెట్లో
‘జోక్కి ‘ స్వేఛ్చానువాదం)
(Courtesy image owner - 18-11-2013)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి