21, జనవరి 2022, శుక్రవారం

అత్తా ఒకింటి కోడలే! – భండారు శ్రీనివాసరావు

 యాభయ్ ఏళ్ళ క్రితం ప్రతి ఉద్యోగానికి ఎంప్లాయ్ మెంటు ఆఫీసు నుంచి నెంబరు అడిగేవాళ్ళు. హైదరాబాదు ఆర్టీసీ క్రాస్ రోడ్డులో వుంది ఆ ఆఫీసు. అక్కడి సిబ్బంది నిరుద్యోగులను కొంత చులకనగా చూసేవాళ్ళు. అక్కడికి వెళ్ళిన మా బంధువును కూడా హీనంగా చూసారని చెప్పడంతో నేను పై వారికి చెప్పాను. వాళ్ళు అతడికి ఎంప్లాయ్ మెంట్ ఆఫీసులోనే ఉద్యోగం ఇచ్చారు. కొన్ని నెలలు గడిచిన తరువాత అతడి వైఖరిలో మార్పు మొదలయింది. నిరుద్యోగులను చిన్నబుచ్చి కసురుకోవడం చూసి ఆశ్చర్యపోయాను. గతంలో అతడూ ఇటువంటి తిరస్కారాలకు గురైన వాడే, అదేమిటో కుర్చీలో కూర్చోగానే మారిపోయాడు.

4 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

మంచి జీత భత్యాలు అందుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పీఆర్సీ పై అసంతృప్తితో అధిక వేతనాలు కోసం సమ్మె బాట పట్టడం సమంజసమేనా? కరోనా కారణం గా ఎన్నో లక్షలమంది ఉపాధి కోల్పోయి బాధలు పడుతున్నారు. ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోయింది. పెంచిన వేతనాలు తృప్తి లేకుండా ఇంకా జీతాలు పెంచాలి అని కోరడం న్యాయమేనా? ఒక సామాన్య పౌరుడు ఒక వీడియో లో ఆవేదన తో నిజాలు చెప్పాడు.

అవసరానికి మించి సంపాదించి ఏమి చేసుకుంటారు? ప్రభుత్వ ఉద్యోగికి, ఉపాధ్యాయులకు సామాజిక బాధ్యత లేదా ? నిజంగా మీరు సేవాభావం తో పని చేస్తున్నారా?
అని సగటు పౌరుడు ప్రశ్నిస్తున్నాడు. ఉద్యోగులు వారి నాయకులు ఒకసారి అంతరాత్మను ప్రశ్నించు కోవాలి.


అజ్ఞాత చెప్పారు...

జీతాల విషయంలో ఉద్యోగుల అసంతృప్తిని జీరో శాతానికి తేవడం అనేది దేవుడికి కూడా సాధ్యపడని విషయమే. నేను ఓ 40 ఏళ్ళ క్రిందటే విన్న ఓ మాట నాకు ఎప్పటికీ గుర్తే. స్టేట్ బ్యాంకు ఉద్యోగుల విషయంలో విన్న మాట అది. "ఆఫీస్ కు వచ్చినందుకు జీతం, పని చేసినందుకు ఓవర్ టైం భత్యం". అది స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులకు అక్షరాలా వర్తిస్తుంది - ఈ విధంగా : "ఆఫీస్ కు వచ్చినందుకు జీతం, పని చేసినందుకు/చెయ్యాలంటే లంచం".
రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఎంత దారుణంగా ముక్కు పిండి లంచాలు వాసులు చేస్తారో పైనుంచి క్రింద వరకు అందరికీ తెలుసు. అప్పుడప్పుడు సోదాలనే తంతుతో గవర్నమెంట్ చేసే సర్కస్ కూడా మనందరికీ తెలుసు. అయినా వాళ్ళు కూడా జీతాల పెంపు కోసం ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటారు. ఎందుకంటే "లంచాలు దాచుకోవడం కోసం, జీతాలు ఇంటి ఖర్చుల కోసం".
నిజాయితీ, సేవాభావం అన్న పదాలు ఉద్యోగస్తులకు ఆమడ దూరం అన్నది వాస్తవిక సత్యం.
నా ఉద్దేశ్యంలో రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో లంచం అనేది తీసుకోకుండా నిజాయితీగా పని జరిగిన నాడే దేశం లంచగొండి తనం నుండి పూర్తిగా విముక్తి పొందినట్లు.
ప్రభుత్వాలు ఉద్యోగస్తుల డిమాండ్ లకు చాలావరకు తలోగ్గడానికి ప్రధాన కారణం - వోటింగ్ mechanism మొత్తం వారి చెప్పుచేతల్లో ఉండటం ప్రధాన కారణం. ఉద్యోగస్తులతో పెట్టుకుంటే ఎలక్షన్ లోన్ నెగ్గడం కష్టం అన్న వణుకుతోనే వాళ్ళ blackmailing - వీళ్ళ ప్రజా ధనం పందేరం.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

“రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో లంచం అనేది తీసుకోకుండా” పని చెయ్యడం, స్త్రీలు “నిర్భయ”లై పోకుండా అర్థరాత్రి కూడా నిర్భయంగా బయట తిరగగలగడం ….. ఇవి రెండూ మన దేశంలో అత్యాశలే.

Chiru Dreams చెప్పారు...

హైదరాబాద్ లో డ్రైవర్లు మీటర్ వెయ్యకుండా ఆటో నడపాలనుకోవడం కూడా