9, డిసెంబర్ 2021, గురువారం

బిపిన్ రావత్ గురించి


రావత్ బిపిన్ రావత్!

దురదృష్టకర  పరిస్తితుల్లో ప్రాణాలు కోల్పోయిన ధీశాలి , చీఫ్  ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సర్వసైన్యాధ్యక్షుడు అనవచ్చేమో)  బిపిన్ రావత్.  ఈ దుర్వార్త తెలిసినప్పటి నుంచి దేశంలో ప్రతి ఇంట్లో  ఆయన నామస్మరణే!

అయితే ఆయనతో సన్నిహిత పరిచయం ఉన్న వ్యక్తి మా కుటుంబంలోనే ఉన్న సంగతి కొంచెం ఆలస్యంగా తెలిసింది. బిపిన్ రావత్ తో దిగిన ఫోటోలను ఆయన మా ఫ్యామిలీ  గ్రూపులో పోస్ట్ చేశారు. పేరు కల్నల్ దుర్గాప్రసాద్. పుట్టింది నిజామాబాద్. ఉద్యోగ విరమణ అనంతరం హైదరాబాదులోనే సెటిల్ అయ్యారు. మా ఆవిడ నిర్మల సొంత బాబాయి కొడుకు. మేమంతా డుంబు అని పిలుస్తాము.  సాయంత్రం అయ్యేసరికి రెండు మూడు టీవీ ఛానళ్లలో దుర్గాప్రసాద్ ఇంటర్వ్యూలు ప్రసారం అయ్యాయి. కింద లింక్ వాటిల్లో ఒకటి. NTv వాళ్ళు ప్రసారం చేశారు. నాకున్న సాంకేతిక పరిజ్ఞానం ప్రకారం ఈ వీడియోలో దుర్గాప్రసాద్ ఇంటర్వ్యూ ఒకటిన్నర నిమిషం తర్వాత మొదలవుతుంది. కార్యక్రమం నిడివి బాగానే వుంది, వివరంగా చెప్పాడు. బాగా చెప్పాడు.

09-12-2021


3 కామెంట్‌లు:

శ్యామలీయం చెప్పారు...

బిపిన్ రావత్ గురించి మీడియా నిరంతరాయంగా కథనాలను వడ్డిస్తూనే ఉంది.

కాని చూసారూ, ఆయనతో పాటుగా మరొక పదముగ్గురు స్వర్గస్థులయ్యారు. ఏ మీడీయాలోనూ వారి గురించిన వివరాలు కాదు కదా, కనీసం వారి పేర్లు కూడా రాలేదు. ఇది ఎంత అన్యాయం! వారు మాత్రం దేశభక్తులు కారా? వారు మాత్రం దేశసేవలోనే మరణించలేదా? వారికి మాత్రం ఊరూ పేరూ ప్రతిష్ఠా వంటివి ఏమీ లేవా? వారికి మాత్రం మనం తగిన విధంగా గౌరవం ఇవ్వవలసిన అవసరం లేదా?

చివరికి మీరూ కనీసం వారి ప్రసక్తి ఐనా తీసుకురాలేదు.

వారి గురించే ఆలోచిస్తున్నాను నేను. అయ్యో వారిని కనీసం స్మరించేవారు కూడా లేరే అని. కేవలం వారి వారి కుటుంబసభ్యులు స్మరించుకుంటారులే‌ అని ఎవరూ వారిని నిర్లజ్జగా కనీసంగా ఐనా పట్టించుకొనక పోవటం దారుణాతిదారుణం!!

రావత్ గారి గొప్పదనం గురించి నేనేమీ విమర్శించటం లేదు. మిగిలిన వారిని కూడా కొంచెం స్మరించినంత మాత్రాన రావత్ గారి స్మృతికి అన్యాయం జరిగిపోదు కూడా.

ధన్యవాదాలు.

Chiru Dreams చెప్పారు...

Agree with you

Chiru Dreams చెప్పారు...
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.