2, డిసెంబర్ 2021, గురువారం

అభిమానం అర్ణవమైతే – భండారు శ్రీనివాసరావు

 “సినిమా టిక్కెట్టు ధర తగ్గిస్తే ఏమిటి? బెనిఫిట్ షోలు ఎత్తేస్తే ఏమిటి? ఒక్కసారి పెద్దమొత్తం ఇలా ఖర్చు చేసేబదులు, మా హీరో సినిమా ఒకటికి పదిసార్లు, వీలయితే వరసగా పాతికసార్లు టిక్కెట్టు కొని చూస్తాం. అదీ మా అభిమానం” అంటున్నాడు ఓ హీరో అభిమాని ఓ టీవీ చర్చలో.

మంచిదే అనిపించింది, సినిమా సక్సెస్ కు రిపీటెడ్ ఆడియన్స్ ఓ గీటురాయి అని తలనెరిసిన సినీపండితుడు చెప్పిన మాట గుర్తుకు వచ్చింది. మళ్ళీ పాతరోజుల్లో మాదిరిగా, ధియేటర్లు పూర్తిగా నిండుతుంటే,  శత దినోత్సవాలు, రజతోత్సవాలు జరిగే  స్వర్ణయుగం తిరిగి వస్తుందేమో!

అయితే ఇలా ఉద్రేకపడే ముందు, ఒక్కసారి ముంచుకు వస్తున్న మూడో వేవ్ గురించి కూడా ఆలోచించండి. మీ కుటుంబం గురించి కూడా ఆలోచించండి.

సినిమా అయినా, అభిమానం అయినా, ఏదైనా  ముందు మనం పదిలంగా వున్నప్పుడే కదా!

(చట్టబద్ధమైన సూచన: ఇది రాజకీయ పోస్టు కాదు. వినవచ్చని విషయంపై వ్యాఖ్య మాత్రమే)  

(02-12-2021) 

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

ఇప్పుడు మన రాష్ట్రాలలో కులాభిమానం దేశభక్తి కన్నా ఎక్కువ .
అది ఉంటె చాలు , ఎన్నికలలో విజయాలు, సినిమాలు హిట్లు . లేకపోతే జీరో