మహాకవి శ్రీశ్రీ రాసిన అనంతం గ్రంధంలో పేర్కొన్న ఒక విషయం జ్ఞాపకం వస్తోంది.
ఆ రోజుల్లో ‘సినిమా రచయితలు – సాంఘిక బాధ్యత’ అనే అంశంపై ఒక సదస్సు ఏర్పాటు చేసి సినీ ప్రముఖులను ఆహ్వానించారు.
మహాకవి శ్రీశ్రీతో పాటు మరో ప్రసిద్ధ సినీ రచయిత మహారధికి ఈ సదస్సులో మాట్లాడే పనిపడింది. సమయాభావం కారణంగా కొంతమందికి ప్రసంగించే అవకాశం లభించలేదు. మహారధి, శ్రీ శ్రీ పక్కపక్క కుర్చీలలో కూర్చుని వున్నప్పుడు మహారధి శ్రీశ్రీతో ఇలా అన్నారు.
‘నాకు కనుక మాట్లాడే అవకాశమే వస్తే నా ప్రసంగాన్ని ‘సినిమా రచయితలు అందరూ సాంఘిక బాధ్యతను మరచిపోయిన తర్వాతనే సినిమారంగంలో ప్రవేశించారు’ అనే వాక్యంతో మొదలు పెడతాను’.
మహారధి వ్యక్తపరచిన ఈ అభిప్రాయంతో శ్రీశ్రీ పూర్తిగా ఏకీవభించారు.
అయితే, ముందే అనుకున్నట్టు మహారధి గారికి ఆ సదస్సులో ప్రసంగించే అవకాశం చిక్కనేలేదు.
ఈ విషయాన్ని శ్రీశ్రీ తన ఆత్మచరిత్రాత్మ చరిత్రాత్మక నవల, ‘అనంతం’ లో రాసుకున్నారు.
అనంతం నవల (?) కి ఈ ‘ఆత్మచరిత్రాత్మ చరిత్రాత్మక నవల’ అనే ట్యాగ్ లైన్ ఎందుకు పెట్టారన్నది తెలియదు. పైగా ఆత్మకధ అని పెట్టరాదని శ్రీశ్రీ ఆంక్ష పెట్టారని, అనంతం మలికూర్పుకి శ్రీ చలసాని ప్రసాద్ ఆ పుస్తకంలోనే తన ముందు మాటగా రాసారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి