“ఎక్కడెక్కడి విషయాలు, ఎప్పటెప్పటివో సంగతులు రాస్తుంటారు, ఏం జ్ఞాపకశక్తండీ మీది” అంటుంటారు స్నేహితులు చాలామంది.
కానీ అందరికీ తెలియని విషయం ఏమిటంటే
నాకు ఏదీ బొత్తిగా గుర్తుండదని.
“నేను రెండు మూడు ప్రశ్నలు అడుగుతాను, ఒకటి
రెండింటికి సరయిన జవాబులు చెబితే సాయంత్రం సినిమాకు తీసుకు వెళ్ళమని నేను అడగను” అనేది మా ఆవిడ.
“కొస్చెన్ నెంబర్ వన్. రాత్రి మీరు భోజనంలో బాగుందని మెచ్చుకుంటూ తిన్న
కూరేది? నెంబరు టూ ప్రశ్న. నిన్న మీరు బయటకు వెళ్ళేటప్పుడు వేసుకువెళ్ళిన చొక్కా
కలరేమిటి? చెప్పగలరా! చెప్పలేరు. మీ మొహం
చూస్తేనే తెలుస్తోంది, చెప్పలేరని. అయ్యొ సంబడం. జ్ఞాపక శక్తి
అట, ఈయన్ని మించిన వాళ్ళు లేరట! మళ్ళీ అనకండి, విన్న
జనం మొహాన్నే నవ్విపోతారు.
“అది సరే! ఇందాక అనగా గుడికి
వెడుతూ వేడి వేడి కాఫీ కలిపి పక్కన పెట్టి
వెళ్లాను. వెడుతూ చెప్పాను కూడా, ఎప్పుడూ ఆ కంప్యూటరులో తల పెట్టి
టిక్కూ టిక్కూ నొక్కడం కాదు, అప్పుడప్పుడూ బయట ప్రపంచంలో ఏం
జరుగుతోంది గమనిస్తూ వుండాలని. కాఫీ వేడిగా వుంది, తాగమని
చెప్పానా! చూడండి, చప్పగా చల్లారి పోయింది. ఇంతోసిదానికి
అబ్బో వాళ్ళు మెచ్చుకున్నారు, వీళ్ళు మెచ్చుకున్నారంటూ ముసి ముసి
నవ్వులు. మళ్ళీ కలుపుకు వస్తాను, ఈ సారయినా వేడిగా తాగండి”
1 కామెంట్:
ఇంటింటి రామాయణం 🙂.
కామెంట్‌ను పోస్ట్ చేయండి