23, జూన్ 2014, సోమవారం

మొదలయిన కొత్త కాపురాలు


ఏడాది క్రితం వరకు ఇలా జరగొచ్చేమో అని అనుకున్నవారు వున్నారు కానీ ఇలానే  జరుగుతుందని ఇదమిద్ధంగా వూహించిన వారు లేరు. ఏదయితేనేం, ఎవ్వరు కారణం అయితేనేం  రాష్ట్ర విభజన జరిగిపోయింది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా అనే రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి.  కొత్త ప్రభుత్వాలు కూడా కొలువు తీరాయి. వాటితోపాటే కొత్త సమస్యలు,  సరికొత్త వివాదాలు పురుడు పోసుకుంటున్నాయి. ఒకరిది వడ్డించిన విస్తరి అని మరొకరు అంటుంటే, పీత  కస్టాలు పీతవి అన్న ధోరణిలో మరోపక్కనుంచి వేరే మాట వినబడుతోంది.  ఒకటి మాత్రం నిజం. కొత్త రాష్ట్రం అన్నాక సమస్యలు తప్పనిసరి. రెండు రాస్త్రాలవి ఒకే మోస్తరు సమస్యలు కాకపోవచ్చు కానీ రెండింటికీ ఎవరి సమస్యలు వారికి వున్నాయి. ఎవరికి వారు తీర్చుకునేవి కొన్ని. పొరుగువారి సాయంతోనో సహకారంతోనో పరిష్కరించుకోగలిగినవి మరికొన్ని. ఇవికాక సొంతంగా సృష్టించుకుని హైరానపడేవి ఇంకొన్ని.  ప్రస్తుతం ఈ మూడో తరగతి సమస్యలే ప్రముఖంగా వెలుగు చూస్తున్నాయి. మీడియాలో ప్రాచుర్యం  పొందుతున్నాయి. వాటిపై ఎడతెగని చర్చలు సాగుతున్నాయి.  అనవసర ఘర్షణలకు, ప్రజల నడుమ అనుమానాలకు కారణం అవుతున్నాయి. అంతటితో ఆగకుండా అసలు ప్రభుత్వాల చిత్తశుద్ధి పట్లనే  లేనిపోని సందేహాలు తలెత్తేలా చేస్తున్నాయి. ఈ కొత్త సమస్యలను అద్దంలో చూపిస్తూ తాము చేసిన  ఎన్నికల వాగ్దానాలను అటక ఎక్కిస్తారేమో అనే సందేహం కలగకుండా చూసుకోవడం ఇద్దరు ముఖ్యమంత్రులకు ఎదురవుతున్నమొదటి  సవాలు.


ఒక్క రాజధాని, కొద్దో గొప్పో మిగులు బడ్జెట్ అనే రెండు మినహాయిస్తే కొత్త  తెలంగాణా రాష్ట్రంలో  చెప్పుకోదగిన లేదా సంతోషపడతగ్గ  విషయం ఏవీ లేదు.  ఆంధ్రప్రదేశ్ అనే పాత పేరుతొ ఏర్పడ్డ కొత్త రాష్ట్రం సంగతి సరే సరి. దానికి  ఆ రాజధాని కూడా లేదు. చెట్లకింద నిలబడి పాలించాల్సిన పరిస్తితి  అని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడే  పదేపదే  చెబుతున్నారు. సాధారణంగా ముఖ్యమంత్రి ఇతర మంత్రులు హైదరాబాదు రాజభవన్ లో పదవీ స్వీకార ప్రమాణాలు చేసిన తరువాత  కొత్త మంత్రులకు ప్రభుత్వ వాహనాలను వెంటనే సమకూర్చడం ఆనవాయితీ. కానీ ఈసారి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని గుంటూరు సమీపంలో పెట్టడంతో ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన తరువాత వాహనాలకోసం కొత్త మంత్రులు నానా హైరానా పడ్డట్టు అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్లు చెబుతున్నారు. సచివాలయంలో కార్యాలయాల కేటాయింపు మొదలుకుని ప్రతి విషయంలో ఈ విభజన అనేది ఒక అడ్డంకిగా తయారయింది. కాకపొతే ఇవన్నీ చిన్న చిన్న సమస్యలు. కాలక్రమంలో సర్దుకునే సమస్యలు. కానీ, నీళ్ళూ, నిప్పూ వంటి అసలు సమస్యలు పొంచుకుని చూస్తున్నాయి. సేద్యపు నీటి పంపిణీ, విద్యుత్ పంపిణీ అంత తేలిగ్గా ముడిపడేలా కానరావడం లేదు. వీటిపై, ప్రధానంగా విద్యుత్ పంపిణీ విషయంలో  మంత్రుల స్థాయిలోనే రగడ మొదలయింది. ఇది చిలికి చిలికి గాలివాన కాకుండా చూసుకోవాలి. అలాగే, పేద విద్యార్ధులకు ఫీజు రీఇంబర్స్ మెంటు విషయం.  నిజానికి ఎన్నికల్లో ఇంకా పెద్ద పెద్ద వాగ్దానాలు చేసినప్పుడు రాష్ట్రం విడిపోతుందని తెలుసుకాని, ఇలాటి సమస్యలు ముందుగా  ఎదురవుతాయని బహుశా వూహించి వుండరు.  ఎందుకంటే కొత్త కాపురం అంటేనే అన్నీ కొత్తగా సమకూర్చుకోవడం. అన్నదమ్ములు విడిపోయినప్పుడు ఆస్తులు పంచుకున్నా వారి అవసరాల్లో  సింహభాగం స్వశక్తితో ఏర్పాటు చేసుకోవాల్సిందే. అది కాపురం పెట్టేవారి శక్తి సామర్ధ్యాలు, దక్షత మీద ఆధారపడివుంటుంది. ఈ విషయంలో రెండు కొత్త ప్రభుత్వాలకి ఓ సారూప్యం వుంది. అదేమిటంటే వాటికి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు నాయుడు, చంద్రశేఖరరావు, ఈ ఇద్దరికీ పరిపాలనలో పూర్వ అనుభవం వుంది.  సామర్ధ్యం విషయంలో ప్రజల్లో కొంత నమ్మకం  వుంది. రెండు రాష్ట్రాలలో వారి పార్టీల విజయావకాశాలను మెరుగు పడేలా చేయడంలో ఈ రెండు అంశాలు కూడా సాయపడ్డాయన్నది సత్య దూరమేమీ కాదు.

కాబట్టి, ఇప్పుడు ప్రజలు వారి నుంచి కోరుకుంటున్నది ఒక్కటే. పరస్పర సంఘర్షణలకు తావివ్వకుండా సహకారానికి పెద్ద పీట వేస్తూ సమస్యల ముళ్ళను ఒకదానివెంట మరొకటి జాగ్రత్తగా ఓపికగా  విప్పుకుంటూ పోవాలి. వారి సమర్ధత, దక్షతల  పట్ల ప్రజలు పెంచుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. అవసరం అయితే కలిసి కూర్చుని పరిష్కార మార్గాలను అన్వేషించాలి. రాజకీయాలు చేయడానికి ఇంకా చాలా వ్యవధానం వుంది. ఈ లోగా అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఉభయ రాష్ట్రాల అభివృద్ధికి ఉపయోగించాలి. వారి సామర్ధ్యం ఈ దిశగా ఉపయోగపడాలి. అంతే  కాని ఒకరిపై మరొకరు నెపాలు మోపుకుంటూ కాలహరణం చేయడం మంచిది కాదు. (23-06-2014)        

15 కామెంట్‌లు:

Jai Gottimukkala చెప్పారు...

"కాబట్టి, ఇప్పుడు ప్రజలు వారి నుంచి కోరుకుంటున్నది ఒక్కటే. పరస్పర సంఘర్షణలకు తావివ్వకుండా సహకారానికి పెద్ద పీట వేస్తూ సమస్యల ముళ్ళను ఒకదానివెంట మరొకటి జాగ్రత్తగా ఓపికగా విప్పుకుంటూ పోవాలి"

ప్రజలు అలా కోరుకున్నట్టు మీకు ఎందుకు అనిపించిందో?

సమస్యలు పరిష్కారం కావాలని కోరుకోవడం సహజం. అది సహకారం ద్వారా కావాలా ఘర్షణ ద్వారా కావాలా అనేది అత్యధిక శాతం ప్రజలకు పట్టింపు ఉండదు.

సమస్యల పరిష్కారం సహకారం ద్వారానే సులువని మీలాంటి పెద్దలు అనుకొవొచ్చు. దీన్ని ప్రజాభిమతంగా చూపించే బదులు మీ అభిప్రాయంగా చెప్పినా దాని విలువ తగ్గదు. There is no need to claim public support for your opinion.

Edge చెప్పారు...

JG,
“సమస్యలు పరిష్కారం కావాలని కోరుకోవడం సహజం. అది సహకారం ద్వారా కావాలా ఘర్షణ ద్వారా కావాలా అనేది అత్యధిక శాతం ప్రజలకు పట్టింపు ఉండదు.”
అత్యధిక శాతం ప్రజలకు పట్టింపు ఉండదు అని మీరు నొక్కి వక్కణించడానికి గల ఆధారాలేమీటో కూడా తమరు సెలవిస్తే మీ ప్రశ్న అర్థవంతంగా ఉండేది. Can you cite any research, study or analysis to support your statement?

అజ్ఞాత చెప్పారు...

హేమిటేమిటి, జై గోరి లాంటి పెద్దమనిషి పెదరాయుడు లాగా ఓ విసయం మీద ఎవరు ఎలా వ్రాయాలో, హేది కరట్టో, కాదో సెప్పినాకా, దానికి ఆధారాలు, ఋజువులు అడగటమా? బ్లాగులోకం ఎటు పోతుంది?

ఎక్కడ ఈ edge మహాశయుడు, అర్జెంట్ గా బ్లాగులోకపు పెదరాయుడు, అభినవ వీరబ్రహ్మేంద్రుడు (హమ్మో ఈయన రాయలసీమోడు, క.చ.రా. దత్తపుత్రుడు జై గోరు feel అయితే సారీ) ను పెసనలు అడగకూడదు, సెప్పిందే ఒబామా దగ్గరనుండి, ఎవరు లోకలు, నాన్ లోకల్ వరకూ వరకు అందరూ వినాల్సిందే అని ఈయనకు సెప్పాలి.

Jai Gottimukkala చెప్పారు...

@Edge:

"ప్రజలకు పట్టింపు ఉండదు" అన్న నా మాట కూడా అభిప్రాయమే.

Edge చెప్పారు...

Glad you realized, JG.
In rushing to find wholes in others argument, we often tend to ignore our own prejudices!

అజ్ఞాత చెప్పారు...

ప్రజలకు పట్టింపు ఉందదనే మాట వాస్తవం కాదు. People are actually concerned because రెండు ప్రభుత్వాల మధ్య గొడవలొచ్చినప్పుడల్లా బలైపోయేది ఇరుప్రక్కలా ఉండే సామాన్యులే. పైవాళ్ళు ఎప్పుడూ క్షేమంగానే ఉంటారు ఎద్దులు కుమ్ముకుంటూంటే లేగదూడల కాళ్ళు విరిగాయని సామెత. కాబట్టి సామరస్యపూర్వక ధోరణి ఎవరిమధ్యైనా అవసరమే. ఎప్పటికైనా అవసరమే. గొడవలు పడడం ఆత్మగౌరవ చిహ్నం అనుకుంటే- అది తమ ప్రజల్ని బలిచెయ్యడానికి సిద్ధపడ్డమే అవుతుంది. ఘర్షణ అంటూ మొదలుపెట్టాక ఇహ నక్కడ గెలుపుకే తప్ప ఏ మార్గంలో గెలుస్తామనే అంశానికి ప్రాధాన్యం అంతరిస్తుంది.

Jai Gottimukkala చెప్పారు...

@Edge:

One difference though.

I do not believe the method (cooperation or conflict) is irrelevant or unnecessary. ప్రజలకు పట్టింపు లేదు అన్నది నా అభిప్రాయం. నాకు పట్టింపు లేదని నేను అనలేదు.

I am not passing off my opinion as vox populi.

అజ్ఞాత చెప్పారు...

1. Jai Gottimukkala చెప్పారు... (23 జూన్ 2014 5:12 PM)

"కాబట్టి, ఇప్పుడు ప్రజలు వారి నుంచి కోరుకుంటున్నది ఒక్కటే. పరస్పర సంఘర్షణలకు తావివ్వకుండా సహకారానికి పెద్ద పీట వేస్తూ సమస్యల ముళ్ళను ఒకదానివెంట మరొకటి జాగ్రత్తగా ఓపికగా విప్పుకుంటూ పోవాలి"

ప్రజలు అలా కోరుకున్నట్టు మీకు ఎందుకు అనిపించిందో?

......................................
......................................

"There is no need to claim public support for your opinion."

2. బ్లాగ్ పోస్ట్ రచయితని పై రకంగా ప్రశ్నించిన ఈ వ్యాఖ్యాత మరి అదే వ్యాఖ్యలో తన ఈ కింది మాట ప్రజల అభిప్రాయం అనే అర్ధం వచ్చేట్లు చెప్పారు.

" సమస్యలు పరిష్కారం కావాలని కోరుకోవడం సహజం. అది సహకారం ద్వారా కావాలా ఘర్షణ ద్వారా కావాలా అనేది అత్యధిక శాతం ప్రజలకు పట్టింపు ఉండదు. "

ఈ statement కి ఆధారాలేమిటి అని వేరే వాళ్ళు అడిగినదానికి జవాబుగా తన తర్వాత వ్యాఖ్యలో (24 జూన్ 2014 2:55 PM) "ప్రజలకు పట్టింపు లేదు అన్నది నా అభిప్రాయం. ........... I am not passing off my opinion as vox populi." అని సమర్ధింపు.

మరి బ్లాగ్ రచయిత కూడా తన పోస్ట్ లో తన అభిప్రాయమే వ్రాశారనుకోవచ్చు గదా.



Edge చెప్పారు...

JG,
That's hypocrisy my friend. You called out the blog author when he seemed to project his own opinion as peoples’ desire. But, you are conveniently ignoring my point that you committed the same mistake yourself when you tried to pass off your own opinion as a fact by saying “an overwhelming majority (అత్యధిక శాతం ప్రజలు) didn’t care either way”.

అజ్ఞాత చెప్పారు...

ఈడ ఏమైపొతున్నాది? బ్లాగులోకపు కామెంట్ల ఈరుడు, తెలంగాణా ఈర ఇధేయుడు, అన్నీ తెలిసిన మా "నై' గోరి లాంటి పెద్దమనిసిని కూడా పెస్నిస్తున్నారేటి, సెప్మా ?

తెలంగాణా సంబంధించనంతవరకూ, మా పెద్ద దొర క.చ.రా. బయట సెప్పింది, బ్లాగులలో సిన్న దొర నై గోరు సెప్పిందే వేదం, వాలు ఎవలు ఎలా రాయాలని సెపితే, అందరూ అలానే రాయాలి, అది తెలుసుకోండి , మా నై గోరిని పెస్నించేముందు.

మరీ పిలకాయలు ఈ మద్దెన సెలరేగిపోతున్నారు, పెద్ద సిన్న సూసుకోకుండాను...., ఇపోక్రసీ అయినా, ఆటోక్రసీ అయినా మా సిన్న దొర "నై" గోరే రైటు, అందరూ తప్పే....ఆయ్!

Jai Gottimukkala చెప్పారు...

@Edge:

You are missing the point.

Everyone has opinions/assessments. Providing a qualifier every time lengthens the comment while adding little value.

In the present case, my opinion on the subject is different from what people (in my opinion) want.

samrish చెప్పారు...

JG:my opinion is not my opinion when my opinion is not a fact and my fact is not a fact when the fact is not my opinionated,am I right?And I am always Right!

Edge చెప్పారు...

“Everyone has opinions/assessments. Providing a qualifier every time lengthens the comment while adding little value.”

Agreed. But, why didn’t you offer the same consideration to the blog author, JG?

"కాబట్టి, ఇప్పుడు ప్రజలు వారి నుంచి కోరుకుంటున్నది ఒక్కటే. పరస్పర సంఘర్షణలకు తావివ్వకుండా సహకారానికి పెద్ద పీట వేస్తూ సమస్యల ముళ్ళను ఒకదానివెంట మరొకటి జాగ్రత్తగా ఓపికగా విప్పుకుంటూ పోవాలి" When you consider this an opinion passed off as vox populi….
“సమస్యలు పరిష్కారం కావాలని కోరుకోవడం సహజం. అది సహకారం ద్వారా కావాలా ఘర్షణ ద్వారా కావాలా అనేది అత్యధిక శాతం ప్రజలకు పట్టింపు ఉండదు.” why isn’t this an opinion being passed off as vox populi?

అజ్ఞాత చెప్పారు...

"నై" దొరా,
నువ్వు బ్లాగులలో దొరవని ఈ పిలకాయలకు తెల్దలే, consideration కేవలం నీలాంటి దొర లకు మాత్రమే అని, కామనర్స్ కు ఉండవని తెలియక ఎదో పెస్నిస్తున్నారు కాని, నువ్వు మాత్రం డంకా భజాయించి నీకు మాత్రమే ఉండే దొర గిరి అధికారాలను, ఏది vox populi నో, ఏది కాదో కూడా నీ లాంటి దొరలకు మాత్రమే సెప్పే అధికారం ఉందని ఇంకో సారి గీ పిలగాళ్లకు సెప్పు!!

అజ్ఞాత చెప్పారు...

According to JG:my opinion is not my opinion when my opinion is not a fact and my fact is not a fact when the fact is not my opinionated,am I right?And I am always Right!

The three elemeents in this universe are incorrigible - saitan, k.c.r and jG, and everybody has to understand it?!.