'భండారు శ్రీనివాసరావు - వార్తా వ్యాఖ్య' (http://bhandarusrinivasarao.blogspot.in/)అనే
పేరుతొ తెలుగులో ఈ నా బ్లాగు మొదలు
పెట్టినప్పుడు నాకు బ్లాగంటే ఏమిటో తెలియదు. తెలుగులో యెలా టైప్ చేయాలో తెలియదు.
నెట్ కనెక్షన్ అంటే ఏమిటో అంతకంటే తెలియదు.
పూణేలో మా రెండో అబ్బాయి సంతోష్ కొత్త కాపురం
చూడ్డానికి వెళ్ళినప్పుడు నాచేత బ్లాగు ఓపెన్ చేయించాడు. యెలా రాయాలో, యెలా పోస్ట్
చేయాలో వాడూ, మా అన్నయ్య కుమారుడు సాయి కలిపి అక్షరాభ్యాసం చేయించి కంప్యూటర్ తెరపై
ఓనమాలు దిద్దించారు. ఆ తరువాత మా పెద్దబ్బాయి సందీప్ ని చూడడానికి అమెరికా
వెళ్ళినప్పుడు కాలక్షేపం కోసం మొదలుపెట్టిన బ్లాగు రాతలు 14 వందల
పైచిలుకు పోస్టింగుల్లోకి వెళ్ళిపోయి అక్షరాలా ఇవ్వాల్టికి మూడు లక్షల హిట్లను
సంపాదించి పెట్టాయి. పబ్లిష్ అయిన కామెంట్లు రెండువేల మూడువందలు దాటాయి బహుశా ఈ జీవితంలో నేను కూడబెట్టుకున్న తొలి,
చివరి సంపాదన ఇదేనేమో! అభిమానించిన అందరికీ కృతజ్ఞతలు. గొప్పకోసం కాదు కాని ఈ విషయాన్ని
పంచుకోవడం అదో తుత్తి. కదా మరి! - భండారు
శ్రీనివాసరావు
NOTE: Artificial image taken from Google
4 కామెంట్లు:
congratulations, sir
sreerama
congrats sir!
అతిత్వరలో మూడు వేల టపాలు & ఆరు లక్షల వీక్షణాల పండుగ జరగాలని నా కోరిక.
Hearty congratulations, Sir!
మీకున్న గొప్ప ఆస్తి మీ అనుభవం. పాతతరం జర్నలిస్టుగా మీరు మా జెనరేషన్ వారికి పాతవిషయాలనెన్నిటినో చెప్తున్నారు అందుకె మీబ్లాగు నా అభిమాన బ్లాగుల్లో ఒకటిగా అయ్యింది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి