4, జనవరి 2014, శనివారం

వెరీ ఇంపార్టెంట్ స్ట్రీట్ ఇన్ కలకత్తా


(ఈరోజు పత్రికల్లో ఢిల్లీ కొత్త సీఎం వుండబోయే అయిదేసి పడక గదుల రెండు జంట భవనాల ఫోటోలు చూసిన తరువాత  2012 మార్చి నెలలో రాసిన ఈ వ్యాసం గుర్తుకు వచ్చింది. ఇప్పటికీ కోల్ కతా 'దీదీ' నేను చూసిన ఇంట్లోనే వుంటున్నారో లేదో తెలవదు) 

కోల్ కటా అని ఇప్పుడు పేరు మార్చుకున్న కలకత్తా నగరంలో వున్న అనేక వేల వీధుల్లో ఇది ఒకటి. దాని పేరు హరీష్ చంద్ర స్ట్రీట్.
గత వారం కాశీ యాత్రకు వెడుతూ మార్గ మధ్యంలో కలకత్తాలో ఆగినప్పుడు పనికట్టుకుని చూసివచ్చిన వీధి ఇదొక్కటే.













ఓపెన్ డ్రైనేజీ. మురుగుకాలువ. వీధిలోనే స్నానాలు.  ఇంటి ఆకారం కూడా లేని టార్పాలిన్ తడికెల నడుమ కాపురాలు. వీధి కుక్కల స్వైర విహారాలు. చూడగానే వికారం కలిగించే చిరుతిళ్ళ అంగళ్ళు.

కలకత్తాలోనే కాదు దేశంలో ఏ బస్తీలో చూసినా ఇలాటి వీధులు అనేకానేకం కానవస్తాయి. అటువంటప్పుడు వెరీ ఇంపార్టెంట్ స్ట్రీట్ అని సన్నాయి నొక్కులెందుకు అనే ప్రశ్న సహజంగానే ఉద్భవిస్తుంది.
అదే. అది చెప్పడానికే ఈ ఉపోద్ఘాతం.

పై ఫోటోలను కొంత క్షుణ్ణంగా పరిశీలిస్తే అందులో ఒకదానిలో బెంగుళూరు పెంకులు  కప్పిన ఒక సాదా సీదా ఇల్లు కనిపిస్తుంది.

ఆ ఇంట్లో వుండే వ్యక్తి మాత్రం అంత సాదా సీదా సాధారణ మనిషి కాదు. కొన్ని దశాబ్దాలపాటు అవిచ్చిన్నంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని పాలించిన మార్క్సిష్టులకు, లెఫ్ట్ పార్టీలకు అధికార పీఠాన్ని  దూరం చేసిన అత్యంత సాదా సీదా రాజకీయ నాయకురాలు, తృణమూల్ అధినేత్రి  ‘దీదీ’ – మమతా బెనర్జీ - ముఖ్యమంత్రి హోదాలో నివసిస్తున్నది ఆ ఇంట్లోనే అంటే ఓ పట్టాన నమ్మడం కష్టం. కానీ కళ్ళతో చూసిన దాన్ని నమ్మక తప్పదు కదా.
సాధారణంగా ఎవరయినా రాజకీయ నాయకులు నివాసం వుండే ప్రాంతాల్లో పౌర సౌకర్యాలు బాగా వుంటాయనీ, మామూలు పౌరులను వేధించే నీటి కొరత, కరెంటు కోతలు వుండవనీ, వీధులు పరిశుభ్రంగా వుంటాయనీ జనంలో ఓ నమ్మకం. నమ్మకమే కాదు మనవైపు చోటా మోటా రాజకీయ నాయకులు, అధికారులు నివసించే ప్రాంతాల్లో ఇలాటి ఇబ్బందులు లేకపోవడం నిజం కూడా.

ఈ నేపధ్యంలో మమతా దీదీ నివసిస్తున్న ఇల్లూ, ఆ ఇల్లు వున్న వీధినీ చూస్తుంటే ఇలాటి రాజకీయ నాయకులు కూడా వుంటారా అనిపించడం అంతే సహజం.  కానీ ఒక ముఖ్యమంత్రి వుండే వీధే అలా వుంటే ఇక మిగిలిన వాటి సంగతేమిటి? దీనికి జవాబు కూడా అంతగా  అర్ధం కాని ‘హింగ్లీ’  (హిందీ-బెంగాలీ) భాషలో ఆ వీధిలో వుండే వ్యక్తి నుంచే లభించింది. కోల్ కటా లోని అన్ని వీధులు బాగుపడ్డ తరువాతే తన వీధిని బాగు చేసే పనికి పూనుకోవాలని దీదీ హుకుం జారీ చేసారట. ఇందులోని నిజానిజాలు ఆ వీధికి ఎదురుగా వుండే మరో వీధిలో కొలువున్న మరో ‘దేవత’ కలకత్తా కాళీనే చెప్పాలి. 

దీదీ సాదా సీదా వ్యవహార శైలి తెలిసిన వాళ్లకు ఆ వీధి వ్యవహారం  అంత ఆశ్చర్యం కలిగించకపోవచ్చు. కాకపొతే,
పోలీసు పటాలాలు, స్టెన్ గన్లు ధరించి పహరా కాసే  అంగరక్షకులు, అడుగడుగు బారికేడ్లు ఇవన్నీ ఏమీ లేకుండా ఒక ముఖ్యమంత్రి అంత సాధారణ జీవితం గడుపుతున్న తీరుతెన్నులు గమనిస్తే రాజకీయ ప్రముఖుల ‘రక్షణ’ కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించడం అంత అవసరమా అన్న సందేహం తలెత్తక మానదు. (19-03-2012) 
(Revised on 04-01-2014)
Photos taken by me.               

5 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

సార్ దీని వల్ల AAP వారి నీతి నిజాయితి ఏమిటి? కాంగ్రెస్‌తో పొత్తు పెట్టున్నప్పుడే వీరి నిజాయితి అర్థమైంది.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@అజ్ఞాత - 'అయిదేసి పడక గదుల జంట భవనాలు' అని మొదట్లోనే రాసిన తరువాత కూడా మీకు ఈ సందేహం యెలా కలిగింది?

Saahitya Abhimaani చెప్పారు...

"..ఇప్పటికీ కోల్ కతా 'దీదీ' నేను చూసిన ఇంట్లోనే వుంటున్నారో లేదో తెలవదు..."

తెలిసే అవకాశం లేదు మాష్టారూ.ఏ వార్తకైనా సరే ఫాలో అప్ అనేది ఉండాలి అన్న విషయం మన మీడియాకు తెలియనుట్టుగా నటించటం వెన్నతో పెట్టిన విద్య. వాళ్ళ దృష్టిలో ఆ వార్తవల్ల ప్రకటనలు వస్తాయైంటే దుమ్ము రేగేట్టుగా తెగ వ్రాస్తారు లేకపోతే అంతే

ప్రస్తుతం మీడియాది ఒక వెర్రి ధోరణి. వాళ్ళ దృష్టిలో "హ్యూమన్ ఇంటరెస్ట్" అయ్యి ఉండి, ఎక్కువగా "ఐ బాల్స్" పట్టుకుంటేనే ప్రసారం/ప్రచురణ. ప్రస్తుతానికి వాళ్ళకి కేజ్రీవాల్ ను మాత్రమే క్రేజీగా రిపోర్ట్ చేస్తున్నారు. నాల్రోజులు పొయ్యాక ఆ క్రేజీ పొయ్యి మరొకటి తగులుకుంటారు. కేజ్రీ వాల్ కంటె ఎంటో పరిశుధ్ధమైన రాజకీయ నాయకులు, అన్ని పార్టీల్లోనూ ఉన్నారు, కాంగ్రెస్ తో సహా. వాళ్ళకు సరైన ఎక్ష్పోజర్ ఇస్తే ఈ మీడియా తన బాధ్యత తీర్చుకున్నట్టె. కాని "పైడ్ న్యూస్" ఇవ్వాళ సామాన్య విషయం అయిపోయింది. సవ్యమైన వార్తలు ఎలా వస్తాయి! ప్రతి మీడియా హౌస్ కు ఉన్న ఆర్ధిక/రాజకీయ "అవసరాల" ప్రకారం సంపాదకీయాలు, వార్తల ప్రచురణ/ప్రసారం. ఇది ఇవ్వాల్టి పరిస్థితి.

UG SriRam చెప్పారు...

‘Incorruptible’ in WikiLeaks, Narendra Modi smiles Narendra Modi and the BJP today made the most of the latest diplomatic cables released by WikiLeaks, saying these showed that the Gujarat Chief Minister was “incorruptible” — in fact, “the lone honest Indian politician”.

http://m.indianexpress.com/news/incorruptible-in-wikileaks-narendra-modi-smiles/766153/

UG SriRam చెప్పారు...

‘Incorruptible’ in WikiLeaks, Narendra Modi smiles Narendra Modi and the BJP today made the most of the latest diplomatic cables released by WikiLeaks, saying these showed that the Gujarat Chief Minister was “incorruptible” — in fact, “the lone honest Indian politician”.

http://m.indianexpress.com/news/incorruptible-in-wikileaks-narendra-modi-smiles/766153/