“జోకులకి కూడా కాపీ రైట్లు వుంటాయా మాస్టారూ”
“కాపీ రైట్ అంటేనే కాపీ కొట్టే రైట్ శిష్యా!”
“ఆరంజి పండుకి యాపిల్ పండుకి వున్న తేడా ఏమిటి?”
“ఆరంజి పండు ఆరంజి రంగులో వుంటుంది. యాపిల్ పండు యాపిల్ రంగులో వుండదు”
యాదగిరి కొత్త మొబైల్ ఫోను కొని తెలిసిన వాళ్ల నెంబర్లకు
ఎస్.ఎం.ఎస్. లు పంపాడు.
ఎస్.ఎం.ఎస్. లు పంపాడు.
“నా ఫోను నెంబర్ మారింది. మునుపు నాది నోకియా 3310 అయితే ఇప్పుడది నోకియా 6610 గా మారింది. దయచేసి ఈ నెంబరు మార్పు నోటు చేసుకోండి.”
“డాక్టర్ గారు ఫుట్ బాల్ ఆడుతున్నట్టు కలలు వస్తున్నాయి”
“అయితే ఈ రాత్రి నిద్రపోయేముందు ఈ మాత్ర వేసుకోండి. సర్దుకుంటుంది”
“రేపటి నుంచి వేసుకుంటా డాక్టర్. ఇవ్వాళే ఫైనల్ మ్యాచ్”
“నేను చనిపోయాననుకో! నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటావా”
“లేదు. నా చెల్లెలు దగ్గరకి వెళ్ళి వుంటాను కాని, మళ్ళీ పెళ్లి చేసుకోను. మరి మీ సంగతేమిటి? నేను పోతే మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటారా?”
“లేదు లేదు. నేనూ మీ చెల్లెలితోనే వుంటాను”
“రాత్రి ఇంట్లో దొంగలు పడ్డారు. ఒక్క టీవీ తప్ప అన్నీ ఎత్తుకెళ్లారు ఇనస్పెక్టర్”
“అదేమిటి టీవీ ఒక్కదాన్ని యెందుకు పట్టుకుపోలేదు”
“దొంగలు వచ్చినప్పుడు నేను టీవీ చూస్తున్నాను”
“ఎందుకలా అంతా పరిగెడుతున్నారు?”
“పరుగు పందెం. గెలిచిన వాళ్లకు మెడల్ ఇస్తారు?”
“గెలిచినవాళ్లకు మెడల్ ఇస్తారు సరే! కానీ మిగిలినవాళ్ళెందుకు పరిగెత్తుతున్నట్టు”
“నేను ఒకడిని హత్య చేసాను. ఈ వాక్యాన్ని భవిష్యత్ కాలంలోకి మార్చి చెప్పు”
“నువ్వు జైలుకు వెడతావ్”
“ వెళ్ళు. వెళ్ళి మొక్కలకు నీళ్ళు పొయ్యి”
“వర్షం పడుతున్నట్టుంది”
“అయితే ఏమిటట! గొడుగు తీసుకెళ్ళు”
“నా మొబైల్ బిల్లు యెంత వచ్చిందో చెబుతారా”
“దానికి నా సాయం అక్కరలేదు. మీ మొబైల్ నుంచి 121 డయల్ చేస్తే మీ కరెంట్ బిల్లు ఎంతో ఏమిటో మీకు వెంటనే ఎస్.ఎం. ఎస్’ వస్తుంది”
“ఏడిచినట్టే వుంది. నేను అడుగుతోంది నా మొబైల్ బిల్లు సంగతి. కరెంటు బిల్లు కాదు”
“ఆ అమ్మాయికి పుట్ట చెముడులా వుంది”
“ఏం అలా అంటున్నావు”
“ ఇందాక ఆ అమ్మాయిని కలిసి నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పా. అలా చెప్పాక కూడా ‘నా చెప్పులు కొత్తవి తెలుసా’ అంటోంది”
“నిన్ను నా కోర్టులో మళ్ళీ మళ్ళీ చూస్తున్నాను. మూడో సారి కూడా ముద్దాయిగా కోర్టుకు రావడానికి నీకు సిగ్గనిపించడం లేదా”
“యెందుకు సిగ్గు! మీరు మాత్రం రోజూ కోర్టుకు రావడం లేదా”
“రాముడు, బుద్ధుడు, మహమ్మదు ప్రవక్త, ఏసు క్రీస్తు, గాంధీ - వీరిలో నీకు కామన్ గా కనిపించే విషయం ఏమిటి”
“అందరూ ప్రభుత్వ సెలవుదినాల్లోనే పుట్టారు
”
“మిస్ నిన్న నా మొబైల్ కేమైనా ఫోను చేసారా?”
“లేదే! ఎందుకలా అడిగారు”
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి