అభిమానం అనే కళ్ళజోడు ధరించి చూస్తే స్వపక్షం తప్పులు చిన్నవిగాను, ఎదుటి పక్షం తప్పులు పెద్దవిగాను కనిపిస్తాయి. (పాలకపక్షం, ప్రతిపక్షం అనే పదాలు వాడలేదని మనవి, అంటే ఇందులో రాజకీయం లేదని అర్ధం)
మన పిల్లవాడు
అద్దం పగలకొడితే ‘ఏదో చంటి సన్నాసి తెలియక చేసాడు, పోనీండి’ అంటాం.
అభిమానం అలా అనిపిస్తుంది.
అదే పక్కింటి
పిల్లోడయితే ‘రౌడీ వెధవ, పెంపకం అలాంటిది’ అని తేలిగ్గా అనేస్తాం. దురభిమానం అలా పలికిస్తుంది.
ఇక్కడ అభిమాన, దురభిమానాలదే
ప్రధాన భూమిక.
వీటికి వయసుతో
నిమిత్తం లేదు.
ఇరవై నుండి అరవై
వరకు ఇదే వరస.
చిన్నప్పుడు సినిమా పోస్టర్లపై పేడ రూపంలో ఇళ్ళ గోడల మీదా, ఇప్పుడు ఫేస్
బుక్ గోడలమీదా.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి