చక్కటి పేరు. యండమూరి నవలల్లో కానవచ్చే పేరు.
అయితే
ఈ వేదసంహిత ప్రముఖ రచయిత, విశ్రాంత ఐ.పి.ఎస్ అధికారి శ్రీ రావులపాటి సీతారామారావు
దౌహిత్రి (పెద్ద కుమారుడు రాజీవ్ చంద్ర కుమార్తె). తాత మాదిరిగానే రచనల పట్ల ఆసక్తి. చదవడంలోనే కాకుండా రాయడంలో
కూడా. అందుకే పదిహేనవ ఏటనే పెన్ను పట్టింది. తొలి రచనే సీతా రామాయణం. అదీ
ఇంగ్లీషులో. అదీ ఒక సుదీర్ఘ కవిత రూపంలో.
వేదసంహిత
మాతామహులు టి.ఆర్,కె, జనార్ధన్, తన మనుమరాలి (కుమార్తె
డాక్టర్ మాధవి కూతురు) రచనా శైలిని ఇలా వర్ణించారు:
“Veda’s poetic narration of the great epic has the speed of
steadily flowing river and the fragrance of ardent devotion to detail. Its
vocabulary is simple, narration is straight forward and rhythm is easy to
catch”
ఈ
పుస్తకం చదివిన తర్వాత అందరికీ ఇదే అభిప్రాయం కలుగుతుందని నాకు అనిపించింది.
ఒక తరం
వారికి, తమ ముందు తరం వారు చిన్ననాటి నుంచి చెప్పిన రామాయణ, భారత, భాగవతాలను విని అర్ధం చేసుకునే
అవకాశం లభించింది. ఈ వేగయుగంలో అది అసాధ్యం. పసితనం నుంచి ఇంగ్లీష్ చదువులు. మరి ఈ
మహత్తర ఆధ్యాత్మిక గ్రంధాలను ఈ తరం వారు, వచ్చే తరం వారు చదివే అవకాశం ఎలా?
ఈ
ప్రశ్నకు సమాధానమే ఈ పుస్తకం.
అలతి
అలతి ఆంగ్ల పదాలతో వేదసంహిత కూర్చిన ఈ సీతారామాయణ గేయ కావ్యానికి (English
title :SRI SITARAMAYANA)
స్పూర్తి, ఆమె తాతగారు రావులపాటి సీతా
రామారావు గారు తెలుగులో రాసిన సీతారామాయణం. అయితే ఇది దానికి అనువాదము కాదు, అనుసరణ కూడా కాదు. లవకుశ చిత్రంలో శ్రీరామ సుతులు గానం చేసిన రామాయణం మాదిరిగా కవితాత్మకంగా
సాగిపోతుంది.
ఆ సినిమాలో రామాయణంలోని అరణ్యకాండ, కిష్కిందకాండ, సుందరకాండ, యుద్ధకాండల సంక్షిప్త సమాహారంగా సముద్రాల రాఘవాచార్య ఈ గీతాన్ని రాశారు. ప్రేమతో, భామతో, చెల్లీ, రోసిల్లీ, పావనీ, రివ్వుమనీ, కోసి, జేసి, సీతా, మాతా వంటి అంత్యప్రాసలతో
కూడిన పదబంధాలు ఆ గీతానికి ఎనలేని శోభను ఇచ్చాయి.
అలాగే
వేద సంహిత విరచిత సీతా రామాయణం కూడా.
ఒకటో
పంక్తి మూడో పంక్తి, అలాగే
రెండో పంక్తి,
నాలుగో పంక్తి ఎబ్బెట్టుగా అనిపించని ప్రాసతో ముగుస్తాయి.
మచ్చుకు
ఒకటి రెండు ఇంగ్లీష్ పద్యాలు (పద్యాలు అనవచ్చునా)
కిష్కింధకాండలో
వాలి వధ వృత్తాంతంలో, వేద సంహిత ఆంగ్ల పదవిన్యాసం ఇలా సాగుతుంది.
“Sugriva and Vali were fighting strong
They fought with trees, stones, fists and feet
They both fought and fought for so long
Between them Rama could not discreet
Then, an idea, Hanuman got
A garland of flowers on Sugriva he set
Then who was Vali, Rama could spot
Then Rama shot at Vali without a fret
హనుమంతుడు
అశోకవనంలో సీతమ్మ వారిని కనుగొన్న సమయంలోనే రావణుడు కూడా అక్కడికి చేరతాడు.
He came to Sita, and harshly said
‘Sita, my promised time is to come to an end
If you don’t accept me, I shall see you dead
Whether you live or not, on your word it shall depend
Then Sita plucked a grass blade beside
Showed it to Ravana and then said
‘You are this when my Rama is by my side
Than to be with you, I am better to be dead
ఇలాంటి
చిరు కవితలు, రెండు వందల పుటల ఈ పుస్తకంలో వేయికి పైగా వున్నాయి.
చిన్న
వయసులో చేసిన గొప్ప ప్రయత్నం. అన్నింటికీ మించి మధురమైన తెలుగు భాషను చదివి అర్ధం
చేసుకోలేని భావి తరానికి రామాయణ కావ్యాన్ని పరిచయం చేయడానికి ఇది చాలా ఉపయుక్తంగా
వుంటుంది. భాష సంగతి పక్కన పెడితే, మన సంస్కృతి
పసి మనస్సుల్లో పదిలంగా వుంటుంది.
వేద
సంహిత మరో ప్రయత్నం కూడా చేసింది. తమ్ముడు అద్విత్ హృదయ్ తో కలిసి ముఖచిత్రంతో
పాటు చక్కని రంగుల చిత్రాలను స్వయంగా చిత్రించి ఈ పుస్తకానికి జోడించింది.
చదవడానికి
వీలైన ఈ పుస్తకాన్ని చూసి, విని
ఆనందించే చక్కటి ఇంగ్లీష్ సంగీత రూపకంగా కూడా రూపొందించి యు ట్యూబ్ లో పెడితే దేశ
విదేశాల్లో కూడా ప్రాచుర్యం పొందుతుంది.
చక్కటి
ప్రయత్నం చేసిన వేదసంహితకు ఆశీ:పూర్వక అభినందనలు.
1 కామెంట్:
వేద సంహిత చక్కటి పేరే. అయితే సినిమా వారికి, కథారచయితలకు మాత్రమే స్వంతం కాదేమో అటువంటి పేర్లు? భావుకత కలిగిన తల్లితండ్రులు తమంతట తామే ఆలోచించి అటువంటి పేర్లు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు మా సమకాలీకురాలొకమ్మాయికి (అప్పట్లో అమ్మాయి 😊) వేద జనని అని అందమైన పేరు.
అసలు విషయానికొస్తే వేద సంహితకు అభినందనలు. చిన్నవయసులోనే అంత ప్రతిభ కనబరచడం మెచ్చుకోదగినది. మరిన్ని చక్కటి రచనలు చేస్తుందని నమ్ముతున్నాను. All the best to her.
అన్నట్లు ఏమనుకోకండి గానీ “దౌహిత్రి” అంటే కూతురి కూతురు (దుహిత = కూతురు). కొడుకు కూతురిని పౌత్రి అంటారు.
మరొక సంగతి. ఏదయినా పుస్తకం గురించి పరిచయం చేస్తున్నప్పుడు వెల, ప్రతులు ఎక్కడ దొరుకుతాయో కూడా చెపితే బాగుంటుంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి