ఏవీ తోచడం లేదా? బోరుకొడుతోందా? అచ్చం ఇలాటివాళ్లకోసమే
మన ఘనమయిన పెట్రోలియం మంత్రిత్వ శాఖ వారు లక్షలు ఖర్చుపెట్టి పత్రికల్లో పెద్ద
పెద్ద ప్రకటనలు ఇచ్చారు. గ్యాస్ సబ్సిడీ పొందేందుకు మీ ఆధార్ నంబరును మీ సంబంధిత
గ్యాస్ కంపెనీకి పంపుకోవడానికి కొన్ని విధానాలను పొందుపరిచారు. అందులో ఒకదాంట్లో వేలుపెట్టి
చూసాను. చీమ కుట్టలేదు కాని తల బొప్పికట్టింది. ఆ కధాక్రమం చిత్తగించండి.
రెండు ఎస్.ఎం.ఎస్. లు పంపండి అన్నారు. ఓస్ ఇంతే కదా అనుకున్నాను. వివరాలు,ఉదాహరణలు కూడా చక్కగా
ఇచ్చారు.
మొదటిది: మొబైల్ నెంబరు నమోదు చేసుకోవడానికి – (గ్యాస్ కంపెనీ): IOC/HPC:REG
<స్పేస్> పంపిణీ దారు ఫోను నెంబరు సున్నా లేకుండా <స్పేస్>
వినియోగదారు నెంబరు (ఉదాహరణకు ) REG 117654321 564321)
రెండో ఎస్ ఎం ఎస్ – మీ ఆధార్ నెంబరు మీ నమోదిత మొబైల్
నెంబరు నుంచి పంపండి.
UID<స్పేస్> ఆధార్ నెంబరు (ఉదాహరణకు: UID
343434343434)
ఇంకేం! కాసేపు ప్రయత్నిస్తే పోలా అనిపించి రంగం
లోకి దిగాను అన్ని నెంబర్లు వివరాలు సిద్దంగా వుంచుకుని సిద్దమైపోయాను.
పత్రికా ప్రకటనలో చెప్పింది చెప్పినట్టు అక్షరం
పొల్లుపోకుండా, నెంబర్లు తప్పు పడకుండా ఏకదీక్షగా కూర్చుని పనిపూర్తి చేసాను.
కొద్ది సేపటిలోనే ఎస్.ఎం.ఎస్. వచ్చినట్టు మొబైల్ లో సంకేతం వచ్చింది. ‘అమ్మయ్య
పనిచేసే ప్రభుత్వం’ అని కితాబు ఇచ్చుకుంటూ ఎస్.ఎం.ఎస్. ఓపెన్ చేసాను. అందులో ఇలావుంది:
For Reg. type
HPDistributorPhoneNumberWithSTDCodeConsumerNumber
and send to 9666023456
ఎక్కడో దూడ వేసాననుకుని మళ్ళీ ఓపిగ్గా అవే
వివరాలతో ఎస్ ఎం ఎస్ పంపాను. సమాధానం తిరుగు టపాలో (ఎస్ ఎం ఎస్ లో) ఠక్కున
వచ్చింది. చూస్తే అందులో:
For Reg. type
HPDistributorPhoneNumberWithSTDCodeConsumerNumber
and send to 9666023456
అక్షరం పొల్లు పోకుండా అంతా “SAME TO SAME”
అయ్యా ఇదీ కధ.
ఏవి సేతురా లింగా! (13-03-2013)
2 కామెంట్‌లు:
I already did like this, mine is successful
@అజ్ఞాత - పురుషులందు పుణ్యపురుషులు వేరు అన్నట్టు అందరూ అదృష్టవంతులు కాలేరు కదా.నా అనుభవం అలా వుంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి