4, మార్చి 2013, సోమవారం

పాత చింతకాయ పచ్చడి కబుర్లు - 5



 ఈ వ్యాసాలు రాసి నాలుగయిదేళ్ళు  గడిచిపోయాయి. ఆనాటి  సంఘటనలు, సందర్భాలు వేరు. అందుకే వీటికి పాత చింతకాయ పచ్చడి కబుర్లు అని పేరు పెట్టాల్సి వచ్చింది. ఇది గమనంలో వుంచుకోవాలని చదువరులకు ముందుగానే విజ్ఞప్తి చేస్తున్నాను. తేదీలు వేసినా కొందరవి గమనించక పోయే అవకాసం వుంది కాబట్టి ఈ వినతి. -  రచయిత

యక్ష ప్రశ్నలకు తక్షణ సమాధానాలు


ప్రశ్న: నెపోలియన్ ఏ యుద్ధంలో మరణించాడు?
జవాబు: అతడు పోరాడిన చిట్టచివరి యుద్దంలో.
ప్రశ్న: భారత స్వాతంత్ర్య ప్రకటనపై ఎక్కడ సంతకాలు జరిగాయి?
జవాబు: ప్రకటన టైపు చేసిన పేజీ చిట్ట  చివర్లో.
ప్రశ్న: విడాకులకు ప్రధాన కారణం ఏమిటి:
జవాబు: వివాహమే
ప్రశ్న: పరీక్ష తప్పడానికి కారణం?
జవాబు: పరీక్షే.
ప్రశ్న: బ్రేక్ ఫాస్ట్ లో తినలేనిది ఏమిటి?
జవాబు: లంచ్, డిన్నరు
ప్రశ్న: యాపిల్ పండును సగానికి కోస్తే  అది యెలా కనబడుతుంది?
జవాబు: కోయగా మిగిలిన సగం మాదిరిగా.
ప్రశ్న: యెర్ర చొక్కాను సర్ఫ్ నీళ్ళల్లో ముంచుతే ఏమవుతుంది?
జవాబు: తడుస్తుంది.
ప్రశ్న:  ఒక చేతిలో నాలుగు యాపిల్ పండ్లు, మూడు మామిడి పండ్లు, మరో చేతిలో ఆరు మామిడి పండ్లు, నాలుగు యాపిల్ పండ్లు వుండాలంటే  ఏం కావాలి?
జవాబు: అన్ని పళ్ళు పట్టే పెద్ద పెద్ద అరచేతులు
ప్రశ్న:నలుగురు  మనుషులు కలసి ఒక గోడను రెండు రోజుల్లో నిర్మిస్తే, ఒకే రోజులో ఆ గోడను నిర్మించడానికి ఎంతమంది కూలీలు కావాలి?
జవాబు: మొదటి  నలుగురే కలసి గోడను కట్టేసినప్పుడు ఇక  కూలీలతో పనేమిటి?

కామెంట్‌లు లేవు: