అయాం ఎ
బిగ్ జీరో మొదలు పెట్టినప్పటినుంచి ఇప్పటికి 93 భాగాలు పూర్తయ్యాయి. మరి కొంచెంసేపట్లో 94 వ భాగం పోస్టు చేయబోతున్నాను. నేను రాసిన
ప్రతిదీ నా వ్యక్తిగత బ్లాగు https://bhandarusrinivasarao.blogspot.com/2025/02/93.html#google_vignette లో పోస్టు
చేయడం అలవాటు. కొంచెం సేపటి క్రితం నా బ్లాగు వీక్షకుల సంఖ్య అక్షరాలా పదిహేను లక్షలకు
చేరుకుంది. అయాం ఎ బిగ్ జీరో మొదలు పెట్టినప్పుడు ఈ సంఖ్య పద్నాలుగు లక్షలు. అంటే
లక్షమంది ఈ జీరోని అభిమానిస్తూ చదువుతున్నారన్న మాట. నిజానికి వీరు నా అభిమానులు
కారు. రేడియో అభిమానులు. రేడియో మీది అభిమానంతో నా రాతల్ని అభిమానిస్తున్నారు.
అందుకే ఈ లక్షమందికి పేరుపేరునా కోటి కైమోడ్పులు
తెలియచేసుకుంటున్నాను. రేడియో బతికే వుంది, దానికి మరణం లేదు అని మరోమారు రుజువైంది. (ఇక్కడ రేడియో
అంటే నేను పనిచేసిన ఆకాశవాణి)
4 కామెంట్‌లు:
ఆటో మీటర్ లాగా తిరిగిపోతుంది మీ బ్లాగు కౌంటర్. ఏదో తేడా కొడుతుంది. తెలుగు బ్లాగులు అంత మంది చదువుతారు అంటే అనుమానమే.
అజ్ఞాత గారు మీ అనుమానం నిజమే అనుకుందాం. కానీ మీరు చదివారు కదా! ఇది నిజమే కదా! అంతమంది చదివినా, చదవక పోయినా మీరు ఒక్కరైతే ఆ మీటర్ లో వున్నారు కదా! అది చాలు నాకు. ఇందులో ఏమైనా డబ్బా డుబ్బా? ఏముందని?
శుభాకాంక్షలండీ పదిహేను లకారాలనుదాటిన శుభసందర్భం లో మా లాంటి డైలీ వీక్షకులకు ఏదైనా మాంఛి ఓ డిన్నర్ పార్టీ ఏర్పాటు చేయండి :)
ఇచ్చినా మీ జెండారం బయటపడుతుందని మీరు రారుగా అయ్యా/అమ్మా, ఎందుకీ ఉబోస?
కామెంట్‌ను పోస్ట్ చేయండి