‘మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు రికార్డింగ్ కి’
కెమెరా మాన్ తో కలిసి పరికరాలు సర్దుకుంటూ అడిగాడు అనీంద్ర అనే ఆ రెడ్ టీవీ జర్నలిస్ట్.
‘ఇదిగో ఈరోజు చేసారు కదా! ఈ ఇంటర్వ్యూని ఎడిట్ చేయకుండా అప్ లోడ్ చేసిన తర్వాత తప్పకుండా కలుద్దాం. ఆరోజు మీరు మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని, ఇంత ధైర్యంగా చూపించిన మీ యాజమాన్యాన్ని అభినందించడానికి నేనే మీ స్టూడియోకి వస్తాను’
అనీంద్ర నా మాటలు సీరియస్ గా తీసుకున్నాడు. కానీ అతడు పనిచేసేది ఓ ప్రైవేట్ ఛానల్ లో. అతడి ఇబ్బందులు అతడికి వుంటాయి. సవాళ్లు విసిరే వయసు నాది కాదు, వాటిని స్వీకరించే వృత్తి వయసు అతడిది కాదు.
అంచేత ఆ విషయం అంతటితో మరచిపోయాను.
మళ్ళీ ఈ ఉదయం ఫోన్ అతడి నుండి.
‘రేపు రమ్మంటారా! ఏ టైముకు రాను?’
నేను జవాబు చెప్పీ లోగా అతడే అన్నాడు.
‘మీరు చెప్పిన వీడియో లింక్ పంపుతున్నాను. ఎడిట్ చేయకుండా మా వాళ్ళు దాన్ని అప్ లోడ్ చేశారు. ఒకసారి చూడండి”
అన్నట్టే కొద్దిసేపటి తర్వాత లింక్ పంపాడు.
చూశాను. వెంటనే ఫోన్ చేసి చెప్పాను.
‘నేనే వస్తున్నాను మీ స్టూడియోకి. లొకేషన్ పంపండి. ఎప్పుడు ఏ రోజు అనేది మీకే వదిలేస్తున్నాను’
ఇంతకీ ఆ వీడియోలో ఏమి వుందంటే.
ఈ వెబ్ ఛానల్స్ గురించి, మీడియా గురించి నా మనసులో, కాదు కాదు, చాలామంది మనసుల్లో వున్న మాటే ఆరోజు బయటకు కక్కేసాను. ఎట్లాగు దీన్ని చూపించరు అనుకున్నా.
కానీ అనీంద్ర గట్టివాడు లాగా వున్నాడు, మొత్తం మీద ఎడిట్ చేయకుండా నేను మాట్లాడినది మొత్తం అందులో వుంది.
అదే ఈ వీడియో, దాని LINK:
https://www.youtube.com/watch?v=Ladz9I2Z5hk&feature=youtu.be
(21-07-2022)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి