దేశ జనాభా అక్షరాలా నూట ఇరవై ఒక్క కోట్ల ఇరవై లక్షలు
ఇందులో ఇరవై కోట్లమంది రిటైర్ అయి పనీపాటా లేకుండా ఇళ్ళల్లో కూర్చున్నారు.
ముప్పయ్యేడు కోట్లమంది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉద్యోగులు
మరో ఇరవై కోట్లు కేంద్ర ప్రభుత్వ సిబ్బంది. (వీళ్ళు పనిచేస్తారంటే ఎవరో కాదు వాళ్ళే నమ్మరు)
కోటిమంది ఐ,టి. రంగంలోవున్నారు. వీళ్ళు పని చేస్తారు కాని మన దేశం కోసం చెయ్యరు.
ఇరవై ఐదు కోట్ల మంది స్కూళ్ళలో చదువుకుంటున్నారు.
కోటిమంది అయిదేళ్ళలోపు వాళ్లు.
పదిహేను కోట్లమంది నిరుద్యోగులు.
కోటీ ఇరవై లక్షలమంది ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుంటున్నారు.,99,998 మంది జైళ్ళలో మగ్గుతున్నారు.
ఇక మిగిలింది నువ్వూ, నేనూ.
నువ్వేమో ఇలా తీరి కూర్చుని ఫేస్ బుక్ లో ఆడవారి పోస్టులకు లైకులు కొడుతూనో, కంప్యూటర్లో మెయిల్స్ చెక్ చేసుకుంటూనో, వచ్చిన వాటిల్లో నచ్చిన వాటిని, నచ్చనివాటిని స్నేహితులకు ఫార్వార్డ్ చేస్తూనో ఎప్పుడూ బిజీగా వుంటావు.
పొతే, మిగిలింది నేనొక్కడిని. ఈ దేశభారం అంతా ఒక్కడినే మోయాలి. వ్చ్! ఖర్మ. నా బాధ ఎవరితో చెప్పుకోవాలి?
(తోకటపా: ఇన్నిన్ని లెక్కలు అవలీలగా చెప్పాడు అంటే ఎక్కడో లెక్క తప్పినట్టే లెక్క. శ్రమపడి కూడడం మొదలు పెట్టకండి)
1 కామెంట్:
ఓ సినిమాలో చిరంజీవి ఏకరువు పెట్టిన స్టాటిస్టిక్స్ లాగానూ, మరో సినిమాలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం చెప్పిన లెక్కలులాగానూ ఉన్నాయి పైన చెప్పిన లెక్కలు 🙂.
కామెంట్‌ను పోస్ట్ చేయండి