27, ఆగస్టు 2021, శుక్రవారం

మ్యూజియంలో కృతజ్ఞత

గూగుల్ ఇమేజ్ సెర్చ్ చేస్తుంటే ఒక కార్టూన్ కనిపించింది.

కంప్లెయంట్స్ (ఫిర్యాదులు), గ్రాటిట్యూడ్ (కృతజ్ఞత) అనే రెండు కౌంటర్లు వుంటాయి.
పిర్యాదుల కౌంటర్ వద్ద పెద్ద క్యూ వుంటుంది.
కృతజ్ఞతలు తెలపాల్సిన కౌంటర్ దగ్గర మాత్రం ఒక్క మనిషీ కనబడడు.
ఆ కార్టూన్, వర్తమాన ప్రపంచానికి, ముఖ్యంగా భారత దేశానికి అద్దం పట్టే కార్టూన్ అని నాకు అనిపించింది.
కొన్నాళ్ళ తరువాతో, కొన్నేళ్ళ తరువాతో పిల్లలకు ‘కృతజ్ఞత’ గురించి తెలియచెప్పాలంటే, మ్యూజియంకు తీసుకు వెళ్ళాలేమో!
బయట ప్రపంచంలో కానరాని వాటిని చూడగలిగేది మ్యూజియంలలోనే కదా!



NOTE: Courtesy Image Owner

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

మన ఇబ్బందులను మాటల్లో చెప్పక తప్పదు కదా. మన ఇబ్బందులను చెప్పకుండా ఇతరులు తరచుగా కచ్చితంగా ఎలా తెలుసుకుంటారు?
మన కృతజ్ఞతను మాటల్లో చెప్పనవసరం కూడా లేదు కదా - మరీ ఇంగ్లీషు వాడి ఊతపదం‌ thanks మాత్రమే సరి అనుకొనే అమాయకత్వం లేనప్పుడు.
ఇలా అలోచించి చూడండి.