మ్యూజియంలో కృతజ్ఞత లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మ్యూజియంలో కృతజ్ఞత లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27, ఆగస్టు 2021, శుక్రవారం

మ్యూజియంలో కృతజ్ఞత

గూగుల్ ఇమేజ్ సెర్చ్ చేస్తుంటే ఒక కార్టూన్ కనిపించింది.

కంప్లెయంట్స్ (ఫిర్యాదులు), గ్రాటిట్యూడ్ (కృతజ్ఞత) అనే రెండు కౌంటర్లు వుంటాయి.
పిర్యాదుల కౌంటర్ వద్ద పెద్ద క్యూ వుంటుంది.
కృతజ్ఞతలు తెలపాల్సిన కౌంటర్ దగ్గర మాత్రం ఒక్క మనిషీ కనబడడు.
ఆ కార్టూన్, వర్తమాన ప్రపంచానికి, ముఖ్యంగా భారత దేశానికి అద్దం పట్టే కార్టూన్ అని నాకు అనిపించింది.
కొన్నాళ్ళ తరువాతో, కొన్నేళ్ళ తరువాతో పిల్లలకు ‘కృతజ్ఞత’ గురించి తెలియచెప్పాలంటే, మ్యూజియంకు తీసుకు వెళ్ళాలేమో!
బయట ప్రపంచంలో కానరాని వాటిని చూడగలిగేది మ్యూజియంలలోనే కదా!



NOTE: Courtesy Image Owner