24, ఆగస్టు 2021, మంగళవారం

15 రోజుల్లో ముగిసిన కధ

 2019 ఆగస్టు  పదిహేడో తేదీ అర్ధరాత్రి దాటిన  తర్వాత, కార్డియాక్  అరెస్టుతో ఆకస్మికంగా నా భార్య నిర్మల చనిపోవడానికి ముందు, కేవలం  రెండు వారాల లోపు వ్యవధానంలో వేడుకలు, వినోదాలు, శ్రావణ శుక్రవారం  నోములు, ముత్తయిదువులకు  వాయినాలు, చుట్టాల ఇళ్ళు చుట్టబెట్టడాలు,  ఇంటికి వచ్చిన వారికి అతిధి మర్యాదలు, హైదరాబాదులో ఇన్నేళ్ళుగా ఉంటున్నా ఎన్నడూ చూడని  రామోజీ  ఫిలిం సిటీలో ఒక రోజల్లా  సరదా తిరుగుళ్ళు...ఒకటా రెండా....అలుపు లేకుండా తిరిగి ఆ అలసట తీర్చుకోవడానికా అన్నట్టు చెప్పాపెట్టకుండా వెళ్ళిపోయింది.

తిథుల ప్రకారం ఈరోజు మా ఆవిడ ఆబ్దీకం.

అమెరికాలో మా పెద్దవాడు సందీప్, కోడలు భావన, ఇక్కడ రెండోవాడు సంతోష్, కోడలు నిషా ఆబ్దీకం బాధ్యత నిర్వర్తిస్తున్నారు. కర్త బాధ్యత లేని భర్తగా మౌనంగా నేను ఇదంతా  చూస్తున్నాను.




(24-08-2021)

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

>> తిథుల ప్రకారం ఈరోజు మా ఆవిడ ఆబ్దీకం.
ఆబ్దికం ఎప్పుడూ పితృతిథుల ప్రకారమే కదండీ చేసేది. ఎంత నాగరీకం ముదిరినా ఇంకా ఇంగ్లీషుక్యాలెండర్ తేదీల ప్రకారం చేసేంతగా ముదరలేదు లెండి మనం. (అన్నట్లు పితృతిధి అంటే సూర్యోదయసమయానికి ఉన్న తిథి అని పొరపడరాదు. దాని లెక్క వేరే ఉంటుంది. దురదృష్టవశాత్తు వీధిపురోహితుల్లో చాలా మందికి ఇతృతిథి నిర్ణయం సరిగా తెలియదు!)