3, జనవరి 2021, ఆదివారం

రాజకీయ కషాయ గుళికలు – భండారు శ్రీనివాసరావు

 

"మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరెందుకు ఖండించరు? మేము నిలదీస్తుంటే మీరెందుకు నిలదీయరు?"
"మీరు చేసేదే మేము చేస్తుంటే ఇక మా పార్టీ ఎందుకు?"


“సుందోపసుందులు కలిసివుంటే కధే లేదు. కలియపడ్డప్పుడే కధ మొదలవుతుంది”


“గతంలో సినిమాలు స్టూడియోల్లో తయారయ్యేవి, ఇప్పుడు రాజకీయ వార్తలు టీవీ స్టూడియోల్లో తయారవుతున్నాయనే పోస్టు చూసి బాధ కలుగుతోంది”


“వెనుకటి రోజులు వేరు కానీ ఇప్పటి రాజకీయాల్లో సవాళ్లు స్వీకరించరు, ప్రతి సవాళ్లు విసురుతారు”


“టీవీ చర్చల్లో కొందరు విశ్లేషకులు, యాంకర్ల పుణ్యమా అని కొన్ని పార్టీల అధికార ప్రతినిధుల పనిభారం తగ్గిపోతోందని గిట్టనివారి వ్యాఖ్య”

కామెంట్‌లు లేవు: