11, జనవరి 2021, సోమవారం

ఇంటింటి డెమోక్రసీ – భండారు శ్రీనివాసరావు

 

“దేశంలో ఏమో కానీ మా ఇంట్లో మాత్రం ప్రజాస్వామ్యం మూడు పువ్వులూ ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది” అన్నాడు ఏకాంబరం పేపరు ముడిచి పక్కన పెడుతూ ఇంటికి వచ్చిన పీతాంబరంతో.

“ఎలా అని కదా నీ అనుమానం. తీరుస్తాను చూడు” అంటూనే “మా ఫ్రెండ్ వచ్చాడు, ఫిల్టర్ వేసి స్ట్రాంగ్ గా రెండు కాఫీ పట్రా” అని కేకేసి చెప్పాడు వంటింట్లో వున్న భార్యతో.

క్షణం ఆలస్యం లేకుండా లోపల నుంచి ఆవిడ గొంతు కాస్త దాష్టీకంగానే వినపడింది.
“చేయి ఖాళీ లేదు, హోటల్ కు వెళ్లి తాగి రండి”

“చూసావా పీతాంబరం! ఇదీ నిజమైన డెమోక్రసీ. నేను ఈ ఇంటి యజమానిని. ఇక్కడ కూర్చుని ఏ ఆర్డర్ వేసే అధికారం అయినా నాకుంది. కానీ దాన్ని అమలుచేసే యంత్రాంగం వంటింట్లో వుంది. కుదరదు అని అంటే నేను చేసేది ఏమీ లేదు”

(11-01-2021)

1 కామెంట్‌:

Zilebi చెప్పారు...అదురహో !

ఇంతకీ దేశంలో ప్రజాస్వామ్యానికి లోటొచ్చె సూచనలేమైనా కనిపిస్తున్నాయా యేమిటి ఏకాంబరాన్ని రంగంలోకి దింపేరు? :)జిలేబి