15, నవంబర్ 2016, మంగళవారం

ఒకరికి ఇబ్బంది, మరొకరికి కష్టం

నోట్ల రద్దు అంశం కేవలం మోడీకి, ఆయన ప్రత్యర్ధులకు సంబంధించింది కాదు. యావత్ ప్రజానీకాన్ని ప్రభావితం చేస్తున్న సమస్య. ఇబ్బందులకు, కష్టాలకు తేడా వుంది. మనం ఇబ్బంది అనుకున్నది వేరొకరికి కష్టంగా వుంటుంది. మన జీవన సరళిని బట్టి ఈ భావన మారుతూ వుంటుంది. తినడానికి రొట్టె లేదని ఒక పేద పిల్ల  ఆకలితో ఏడుస్తుంటే ఓ  రాజకుమారి,  'రొట్టె దొరక్కపోతే కేకు తినొచ్చుకదా నా లాగా' అందట. 
మీడియా పనికట్టుకుని మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తోందని అంటున్నారు. మీడియా వ్యతిరేకం అయినంత మాత్రాన పిడుగులు పడవు. ట్రంప్ కు మీడియా పూర్తిగా వ్యతిరేకం. అయినా అక్కడ ఏం జరిగింది? మీడియాని పక్కన పెట్టండి.
దేశంలో సామాన్యుడికి ఊరట కలిగించేవి చిన్న చిన్న  కార్టూన్లు, జోకులు. సీరియస్  వాతావరణం నుంచి ఎంతోకొంత ఉపశమనం కలిగిస్తాయి. రాజకీయ నాయకుల్లో సెన్స్ ఆఫ్  హ్యూమర్ రోజురోజుకీ తగ్గిపోతోంది. ప్రజాస్వామ్య ప్రియులకు ఆందోళన కలిగిస్తున్నఅంశాల్లో  ఇదొకటి. ఒక పాత సంగతి ముచ్చటించుకుందాం.   1962 లో చైనాతో జరిగిన యుద్ధంలో భారతదేశానికి  ఘోర పరాభవం ఎదురయినప్పుడు,  ప్రముఖ కార్టూనిష్టు ఆర్. కే. లక్ష్మణ్,  నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పై ఒక కొంటె కార్టూన్ వేసారు. నెహ్రూను చిన్నబుచ్చుతూ వేసిన ఆ కార్టూన్  కారణంగా ఆయన అభిమానులనుంచి దాడి తప్పదు అని  అనుకుంటుంటే, లక్ష్మణ్ గారికి  నెహ్రూ నుంచి ఉత్తరం వచ్చింది.
‘పొద్దున్నే పత్రికలో మీ కార్టూన్ చూసి నాకెంతో సంతోషమయింది. అది చూడగానే నా మనసుకు ప్రశాంతత చిక్కింది.  దాన్ని కొంత పెద్దదిగా గీసి పంపిస్తే ఫ్రేం కట్టించి దాచుకుంటాను.” అని రాశారు నెహ్రూ.
ఈ రోజుల్లో, కార్టూన్లు, జోకులు  కొండొకచో కొంచెం శృతి మించుతున్న మాటా నిజమే. కానీ అవి చదవగానే రాసిన వారెవరో ఎందుకోసం రాసారో సులభంగా తెలిసిపోతూనే వుంటుంది. ఎందుకంటే దేశం ఇప్పుడు రాజకీయ పార్టీల వారీగా, నాయకుల వారీగా విడిపోయి వుంది. ఈ విభజన వల్ల లాభపడేది పార్టీలే, దేశం కాదు.
బాపూ సినిమాలో రావు గోపాల రావు అన్నట్టు మడిసన్నాక కూసింత కలాపోసన వుండాలి.

అది కూడా రాజహంస మాదిరిగా పాలను నీళ్ళను వేరు చేసి చూడగలిగే విధంగా వుండాలి.

9 కామెంట్‌లు:

venkatram rao చెప్పారు...

Srinivasa Rao Garu,

Yes, there is problem for every one regarding Ban of Big Notes. I am also have problem got Cash (100 Rs notes) from ATM Today morning!!! I went to Bank but they informed that they are distributing 2000 notes only and advised to deposit the old notes and returned back due to heavy rush. As we have very less (Below 10) there is no problem for us but certainly it is difficult whom have a lot.

Zilebi చెప్పారు...



###ప్రముఖ కార్టూనిష్టు ఆర్. కే. లక్ష్మణ్, నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పై ఒక కొంటె కార్టూన్ వేసారు

ఆ కార‌ ట్యూను ఏమిటో విశదీకరించవలె :) లేకుంటే ఆ కారప్పూస పట్టి ఇక్కడ వేయవలె :)

జిలేబి

Pavan Kumar Reddy Rendeddula చెప్పారు...

Nice Post Srinivas Rao Gaaru. As Zilebi gaaru said want to know/see about that cartoon please.

శ్రీనివాసుడు చెప్పారు...

వీర జిలేబీ మాతా!
తమరు అడిగిన కార ట్యూనే కాదు, కారప్సూస, జాంగ్రీ, పప్పుండ, లడ్డు, బొబ్బట్టు, మైసూర్ పాక్, సున్నుండ, అరిసె, గవ్వలు యను నవవిధ షడ్రసోపేతమైన లక్ష్మణ కార ట్యూనులు ఈ లంక లోగలవు. లంఘించి చూడుడు.
జై భజరంగ బలి!
9 Hard-Hitting Cartoons By R.K. Laxman Which Ignited India

http://trak.in/tags/business/2015/01/30/9-hard-hitting-cartoons-by-r-k-laxman/

ఇట్లు
తమ శిష్య పరమాణువు

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

శ్రీనివాసుడు గారు, మీ "గురువు" గారి సంగతేమో గానీ నేను మాత్రం "లంఘించ" కుండానే మీరిచ్చిన లింక్ తెరచి చూశాను 🙂. లక్ష్మణ్ గారి ఆణిముత్యాలు దొరికాయి. మంచి లింక్ ఇచ్చారు, థాంక్స్.

chandrika చెప్పారు...


భండారు శ్రీనివాస్ గారు, తెలియని విషయాలు బాగా చెప్తారు మీరు. శ్రీనివాసుడు గారు, విన్నకోట వారిదే నా మాట కూడాను. మంచి లంకె ఇచ్చారు. ధన్యవాదాలు

శ్రీనివాసుడు చెప్పారు...


నరసింహారావు గారూ, చంద్రిక గారూ,
ఇంకా అద్భుతమైన తినుబండములను ఇక్కడ చూడండి. దీనిలో six decades of common man వీడియో కూడా వుంది.

20 Best Editorial Cartoons by famous Indian cartoonist RK Laxman
http://webneel.com/rk-lakshman-editorial-cartoons-indian-cartoonist

మరిన్ని పాలతాలికలు

The Best of RK Laxman Cartoons - Courtesy: Times of India

https://www.facebook.com/media/set/?set=a.386138938096800.93362.217935874917108&type=3

ఇంకా ఆయన స్వంత వెబ్ సైట్ కూడా
Art work R.K. Laxman

http://www.rklaxman.com/artwork.html

శ్రీనివాసుడు చెప్పారు...

మరికొన్ని లక్ష్మణ బాణాలు

Cartoonist R K Laxman - Best of RK Laxman's cartoons
https://www.youtube.com/watch?v=ZfmyDyidMzE

RK Laxman: The Uncommon Man
https://www.youtube.com/watch?v=QzFUOwPTNqM&t=140s

అంతర్జాలంలో మాల్గుడి డేస్ వీడియోలన్నీ వున్నాయి మీకు ఆసక్తి వుంటే చూడండి.

Malgudi Days - मालगुडी डेज - Episode 1 - Swami And Friends

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

ఆసక్తికరమైన లింకులు మరిన్ని ఇచ్చారు కదా శ్రీనివాసుడు గారు. ఆనందం. థాంక్సండి.