30, నవంబర్ 2016, బుధవారం

భయమా! గౌరవమా!


పూర్వం సినిమాహాళ్ళలో విధిగా జాతీయ గీతం వేసేవాళ్ళు. జనం అందరూ గౌరవపురస్సరంగా లేచి నిలబడేవారు. ఆ తరువాత అ పద్దతికి స్వస్తి చెప్పారు. ఇప్పుడు సుప్రీం ఆదేశం అంటున్నారు. చూడాలి.
వెనుక మాస్కోలో వున్నప్పుడు ఒక జోక్ చెప్పుకునేవారు (పెరిస్త్రోయికా కాలంలో)
సోవియట్ యూనియన్ లో స్టాలిన్ హవా నడిచేరోజుల్లో ప్రతి సినిమా హాల్లో ఆటకు ముందు స్టాలిన్ బొమ్మ వేసేవాళ్ళు. వెంటనే జనం అందరూ లేచి సాల్యూట్ చేసేవాళ్ళు.
ఒకరోజు స్టాలిన్ సినిమాకి వెడితే యధాప్రకారం జనం నిలబడి సాల్యూట్ చేశారు. అది తనే కనుక స్టాలిన్ నిలబడలేదు. గర్వంగా పక్కవాడితో అన్నాడు.
“స్టాలిన్ అంటే అంత గౌరవమా!” అని.
చీకట్లో గుర్తుపట్టలేదు కాబోలు జవాబు ఇలా వచ్చింది.

“గౌరవమా పాడా! భయం. నిలబడకపోతే సైబీరియా మంచు ఎడారుల్లో ఒదులుతాడు ఆ  పాపిష్టోడు.”     

3 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

అప్పటి సోవియట్ యూనియన్ లో ప్రజలకున్న భయం, మారుతుండే రాజకీయాలు ప్రతిఫలించే జోకొకటి అప్పట్లో నేను చదివినది (The Illustrated Weekly of India లో అని గుర్తు) ఇంచుమించు ఇలాగే ఉంటుంది. 1960 ల్లో సోవియట్ ప్రధానమంత్రి కృశ్చేవ్. ఓ పౌరుడు తనకున్న ఏవో బాధల వల్ల "డౌన్ విత్ కృశ్చేవ్" అని అరుచుకుంటూ వీధుల్లో తిరుగుతున్నాడు; అది చూసి పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. చాలా ఏళ్ల తరువాత జైల్ నుండి విడుదలయి బయటకు వస్తాడు. ప్రభుత్వానికి తన విధేయత చూపిద్దామనుకుని "లాంగ్ లివ్ కృశ్చేవ్" అని అరుస్తాడు, మళ్ళీ పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పడేస్తారు - ఎందుకంటే అప్పటికే కృశ్చేవ్ ని గద్దె దింపేసి బ్రెజ్నెవ్ ప్రధానమంత్రిగా ఉన్నాడు. 😀😀

sarma చెప్పారు...

సోవియట్ గురించి చెప్పుకుంటే ఇలా ఎన్నో! ఒక చిన్న సంఘటన :)

కృశ్చేవ్ ఒక సభలో ప్రసంగిస్తూ అంతకు ముందు నాయకుడు ఎవరో చాలా నిరంకుశంగా ప్రవర్తించారు అని విమర్శించారు, అప్పుడు సభలోంచి ఒక మాట వినపడింది, ”అప్పుడు మీరేం చేశారని?”. దానికి కృశేవ్ ”ఆ మాటన్నదెవరో లేచి నిలబడండి” అంటే ఎవరూ లేవలేదు. అప్పుడు కృశ్చేవ్ ”ఇప్పుడు నువ్వెందుకు లేవలేదో అప్పుడు నేనూ అందుకే అడగలే”దన్నారట :)

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

హాహాహా శర్మ గారు 😀.