7, ఏప్రిల్ 2014, సోమవారం

ఉభయతారకం

పొత్తులతో కుదేలవుతున్న పార్టీలకి  ఓ చిన్న చిట్కా.
A పార్టీ B పార్టీకి పొత్తులో భాగంగా  పలానా స్థానాలు ఇవ్వడానికి అంగీకరించింది. పలానా రెండో పార్టీ పలానా మొదటి పార్టీకి పలానా పలానా స్థానాలు వొదులుకోవడానికి సిద్ధపడింది. కానీ ఆ పలానా పలానా స్థానాల్లో పాతుకుపోయిన వాళ్లకు యెలా సర్ది చెప్పేట్టు. అందుకే ఈ చిట్కా.
అలా పాతుకుపోయివున్న పాతవారికి పొత్తు కుదుర్చుకునే కొత్త పార్టీ కండవా కప్పేసి ఆ కొత్త పార్టీచేత బీ ఫారం వారిచేతిలో పెట్టించాలి. పొత్తు కుదుర్చుకున్నట్టు వుంటుంది. తమ పార్టీ వాళ్ళకే టిక్కెట్టు ఇప్పించినట్లు వుంటుంది. ఉభయతారకం. ఏమంటారు?    

1 కామెంట్‌:

hari.S.babu చెప్పారు...

దాని కన్నా "A" పార్టీని "B" అనుకుని "B" పార్టీని "A" అనుకుంటే సరిపోతుంది. సో సింపులూ:-)