27, ఏప్రిల్ 2014, ఆదివారం

ఏ నిమిషానికి ఏమిజరుగునో ........


మంథా భానుమతి గారు 'హ్యాపీ మూమెంట్స్' రాయడం మొదలు పెట్టిన తరువాత అలా అందరూ తలా ఓ చేయివేస్తే అంతా హాయిగా చదువుకోవచ్చు కదా అనిపించింది. కానీ మళ్ళీ ఆవిడే రాశారు తెలిసిన వాళ్ళెవరో పోయారు, విషాద వార్తను పంచుకోవాల్సివచ్చిందని. పోతే, మా కధ.
ఆదివారం అన్నీ లేటే! కాఫీలు టిఫిన్లు.
వంటావిడ వచ్చి చేసిన ఇడ్లీలు తిని, పొద్దున్న (ఛానళ్ళ కోసం) చదివిన పత్రికల్నే మళ్ళీ తీరిగ్గా  చదవడానికి గదిలోకి వెళ్లాను. మా ఆవిడ పూల కుండీల్లో నీళ్ళు పోశారో లేదో చూడడానికని బయటకు వెళ్ళింది. మావాడు సంతోష్  పెట్టిన టిఫిన్ చల్లారిపోతున్నా పట్టించుకోకుండా 'వాట్సప్' లో మునిగితేలుతున్నాడు.
ఇంతలో భళ్ళున చప్పుడు. తలుపులు విరిగి విసురుగా దూరాన పడ్డ శబ్దం. బయటకు వచ్చి చూస్తే వంటిల్లు రణరంగంలా వుంది. కిచెన్ ప్లాట్ ఫారం కింద గ్యాస్ క్యాబిన్ తలుపులు దూరంగా పడివున్నాయి. సిలిండర్ రెగ్యులెటర్ నుంచి మంటలు వస్తున్నాయి. మావాడు మంచినీళ్ళబాటిళ్లలోని నీళ్ళతో ఆ మంటలపై చల్లుతున్నాడు.    
అవి ఓ పట్టాన కంట్రోల్ కావడం లేదు. ఎలారా అని అనుకుంటున్న సమయంలో 'లక్కు' అనేది మాకూ , జరగబోయే బీభత్సానికి నడుమ అడ్డుగోడలా నిలిచింది. మంటలు ఆరిపోయాయి. సిలిండర్ తీసి బయట పడేశాము.
ప్రస్తుతం మా ఆవిడ పర్యవేక్షణలో సంప్రోక్షణ జరుగుతోంది.
మావాడు కిచెన్ కు సెలవు ప్రకటించాడు. బహుశా ఈ పూట మధ్యాహ్నభోజనం బయట హోటల్లోనేమో!
కధ సుఖాంతం 


5 వ్యాఖ్యలు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

Hmmm...lucky escape.

Hari Babu Suraneni చెప్పారు...

మొత్తానికి పెద్ద ప్రమాదమే తప్పించుకున్నారు!ఈ సౌకర్యాలు లేని నాడేమో కట్టెల పొయ్యిలతో అవస్థలు పడ్డాం. వీటితో ఆ అవస్థ తప్పింది గానీ ప్రాణభయం వొచ్చి పడింది.ఇన్న్నిటినీ కనిపెట్టిన ఈ మనిషిని కనిపెట్టిన వాడికి నెనర్లు చెప్పుకోవదమే మనం చేయగలిగింది.

భండారు శ్రీనివాస రావు చెప్పారు...

@ haribabu Suraneni - Thanks

భండారు శ్రీనివాస రావు చెప్పారు...

@విన్నకోట నరసింహారావు - ధన్యవాదాలు

SIVARAMAPRASAD KAPPAGANTU చెప్పారు...

Thank God, you and your family escaped. May God protect you all ever after.