4, మార్చి 2014, మంగళవారం

పెద్ద గీత ముందు చిన్నగీత ఈ జీవితం


వాళ్ల ఆఫీసుదగ్గర పెద్ద వర్షం పడుతోందని ఎవరో నెట్లో పెట్టారు. వెళ్ళి తలుపు తెరిచాను. విసిరి కొట్టినట్టు జల్లు. మొహం చేత్తో తుడుచుకుంటూ బయటకు చూసాను. నాలుగంతస్తుల పైనుంచి పరికిస్తుంటే  నిలబడి చూడాలనిపించేంత అందంగా కురుస్తోంది వర్షం.


ఫోను చప్పుడయింది. 'కింద వున్నాం పైకి వస్తున్నాం' అన్న మెసేజి. లోపలకు వెళ్ళి టవల్ తో మొహం తుడుచుకుని హాల్లోకి వచ్చాను. ఈలోపలే పైకి వచ్చిన  టీవీ  సిబ్బంది వాళ్ల ఏర్పాట్లు వాళ్లు చేసుకుంటున్నారు. కరెంటు పోయిన సంగతి కూడా తెలియలేదు ఇన్వర్టర్ వుండడం వల్ల. లైటింగ్ సెట్ చేసుకుంటూ వుండగానే పెద్ద శబ్దంతో ఫోకస్ బల్బు పేలిపోయింది. బాల్కనీ వెలుతురులోనే వాళ్లు మునిసిపల్ ఎన్నికలమీద 'బైట్' తీసుకు వెళ్ళిపోయారు. ఇంతలో పనిమనిషి ఆయాసపడుతూ వచ్చింది. లిఫ్ట్ లేదేమో నాలుగు అంతస్తులు మెట్లెక్కి వచ్చినట్టుంది. కాస్త ముందు వచ్చివుంటే బాగుండేది అనుకుంటున్నాను. ఇంతలో ఆవిడే నోరు విప్పింది. 'పాడు వర్షం పాడువర్షం. మొత్తం ఇల్లంతా కొల్లేరు చేసింది. పక్కబట్టలు, బియ్యపు మూట అన్నీ తడిసి ముద్దయ్యాయి. కాలంకాని కాలంలో ఈ పాడు వర్షం మా ప్రాణం తీయడానికే వచ్చింది"
కాసేపటి  క్రితం హాయిగా  అనిపించిన వాతావరణం 'మదిలో, గదిలో' ఒక్కసారిగా మారిపోయింది.
నిజమే పెద్ద గీత ముందు చిన్నగీత ఈ జీవితం.

3 కామెంట్‌లు:

Krishna Palakollu చెప్పారు...

touching sir!

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@Krishna Palakollu - Thanks

hari.S.babu చెప్పారు...

నిజమే నండీ! సినిమా పాటలు చూడండి 'బ్రతుకంత బాధగా కన్నీటి ధారగా' అని ఒక చోట రాసి గుందెలు పిందేస్తారు, అంతలోనే 'బ్రతుకూ కన్నీటి ధారల లోనే బలి చేయకూ' అని హుషారునీ తెప్పిస్తారు.రెండూ ఒకే కవి రాసి ఉండొచ్చు. యే మూడ్లో ఆ పాట వినాలి.

మనం హుషారు మూడ్ లో ఉండి యేడుపు పాట వింటే ఒక రకం చిరాకయితే మరీ దరిద్రమయిన మూడ్ లో వుషారు పాట వింటే వెక్కిరిస్తున్నంత చెర్రెత్తుకొస్తుంది.