16, మార్చి 2014, ఆదివారం

"చేతిలో చెయ్యేసి చెప్పు ......"

వార్త - వ్యాఖ్య
బహు చిత్రమైన రాజకీయం నడుస్తోంది.
రాజకీయాల్లో మాట ఇవ్వడమే కాని నిలబెట్టుకునే సంప్రదాయం లేదని చరిత్ర చెబుతోంది.
కానీ ఇప్పుడు ప్రతి రాజకీయ నాయకుడు ఇచ్చిన మాట నిలబెట్టుకునేవాడే.


ఉదాహరణకు సోనియాగాంధీ. తెలంగాణా ఇస్తా అని కే సీ ఆర్ కి మాట ఇచ్చింది. మరోపక్క పార్టీ తుడిచిపెట్టుకు పోతున్నా ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. ఇది ఆ పార్టీ వాళ్ళే గొప్పగా చెప్పుకుంటున్న మాట.
'కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ప్రజారాజ్యం పార్టీని పునరుద్దరించాలని అభిమానులు, కార్యకర్తలనుంచి నాపై తీవ్రమైన వొత్తిడి వుంది. అయినా సరే సోనియా గాంధీకి ఇచ్చిన మాట మేరకు కాంగ్రెస్ లో కొనసాగుతున్నాను' అని చిరంజీవి దిగ్గీరాజాతో అన్నట్టు ఈరోజు  పత్రికల్లో వచ్చింది.

కలికాలం కాకపొతే రాజకీయ నాయకులేమిటి?  మాట నిలబెట్టుకోవడాలు ఏమిటి?

1 కామెంట్‌:

hari.S.babu చెప్పారు...

కలి కాలం కాదు, ఆకలి కాలం.వారి ఆకలి తీరడానికి మాత్రమే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు.మాత నిలబెట్టుకుంటేనే వారి ఆకలి తీరుతుంది గనక నిలబెట్టుకుంటున్నారు - అంతే!