మాస్కో ఎయిర్ పోర్ట్ లో ఇంగువ తెచ్చిన తంటా
"మాస్కోలో శాకాహారులకు ఏమీ దొరకవు అన్న హెచ్చరికలతో బయలుదేరిన మేము - మాస్కో ఎయిర్ పోర్ట్ లో లగేజి కలెక్ట్ చేసుకునేందుకు ఎదురు చూస్తున్నాము. హైదరాబాదు నుంచి సూటు కేసులనిండా పట్టుకొచ్చిన వంట సంభారాలతో కస్టమ్స్ అధికారులనుంచి ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు కాని, మా ఆవిడ తెచ్చిన ఇంగువ డబ్బా కొంత తంటా తెచ్చిపెట్టింది. ఇంగువని ఇంగ్లీష్ లో ఏమంటారో ఆ క్షణంలో గుర్తురాలేదు. అది తినే వస్తువనీ, వంటల్లో వాడుకుంటామని ఎన్నో విధాలుగా చెప్పిచూసాను. ఇంగ్లీష్ భాష ఇసుమంత కూడా అర్ధం కాని రష్యన్ అధికారుల ముందు నా ప్రయత్నం వృధా ప్రయాస అని అర్ధం అయింది. పైపెచ్చు ఘాటయిన ఇంగువ వాసన వారి అనుమానాలను మరింత పెంచింది. చివరకు ఇంగువ ముక్క నోటిలో వేసుకుని నమిలి చూపించి, అది వారనుకుంటున్నంత ప్రమాదకరము, మాదక ద్రవ్యం కాదని రుజువు చేసుకున్న తరువాతనే అక్కడ నుంచి బయట పడగలిగాము"
ఇలాటి సంగతులు తెలుసుకోవాలంటే ‘మార్పుచూసిన కళ్ళు’ పుస్తకం చదవండి. అలనాటి కమ్యూనిస్ట్ రష్యా చరమాంకం విశేషాలను అక్షరబద్ధం చేస్తూ సాగిన రచన. ముద్రణ పూర్తయి విడుదలకు సిద్ధంగా వుంది. ప్రతులకు, వివరాలకు: శ్రీ కె. లక్ష్మణరావు, కార్యదర్శి, వయోధిక పాత్రికేయ సంఘం, హైదరాబాదు. ఫోను: , Email: lakshmanarao_konda@yahoo.co.in>,
4 కామెంట్‌లు:
మీ పుస్తకం బ్రహ్మాండంగా ఉండే ఉంటుంది ఎందుకంటే మీ మాస్కో సంగతులు బ్లాగులో చదివాం కాబట్టి - కానీ, నాదో కొచ్చెను! వయోధిక పాత్రికేయ సంఘమా? చాలా బావుంది సార్! మరిన్ని వివరాలు తెలియచెయ్యండి.....
మీ నుండి ఆశించాం..మంచి ప్రయత్నం చేశారు...thank you sir..
@మాగంటి వంశీ మోహన్ - ఇప్పుడు నా వయసు 66+ వయోవృద్ధ సంఘం అంటే బాగుండదని ఇలా పేరు పెట్టుకున్నాం. పాతికేళ్ళ తరువాత ఈ రచనకి మోక్షం లభిస్తోంది. అదొక్కటే సంతోషం.- భండారు శ్రీనివాసరావు
@KVSV -ధన్యవాదాలు -భండారు శ్రీనివాసరావు
కామెంట్‌ను పోస్ట్ చేయండి