విడాకులా! వద్దు బాబోయ్!! అనే భర్తలు
“అక్కడ అన్ని విషయాల్లో పెద్దపీట స్త్రీ
బాలవృద్ధులదే!. ఆనాటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఆడవారికి కొన్ని ప్రత్యేక హక్కులు
కల్పించింది. చలిదేశం కాబట్టి ప్రతి వారికి చిన్నదో పెద్దదో ఓ గూడు అవసరం. కొంపాగోడూ
లేని వాళ్లు మనదగ్గరలాగా ఫుట్ పాతులపైనా, ప్లాటుఫారాలపైనా రోజులు వెళ్ళమార్చడానికి
వీలుండదు. ఇళ్ళ కేటాయింపు ఆడవారి పేరుపై చేసే పద్దతి ప్రవేశపెట్టడంతో కాలక్రమేణా ఇంటి వ్యవహారాల్లో పడతుల పట్టు పెరుగుతూ వచ్చింది.
ఆర్ధిక స్వావలంబన స్వేచ్చాజీవితానికి ఆలంబనగా మారింది. నిండా ఇరవై ఏళ్ళు
నిండకుండానే మొదటి ముగ్గురు మొగుళ్లకు విడాకులు
ఇచ్చి నాలుగో పెళ్ళికి సిద్ధం కాగల సత్తా రష్యన్ యువతుల సొంతం అయింది. సోవియట్
రష్యాలో ఏటేటా పెరిగిపోతున్న విడాకుల విషయంలో ఓ జోకు ప్రచారంలోకి వచ్చింది.
భార్యాభర్తల్లో విడాకులు ఎవరు ఇచ్చినా, ఎముకలు
కొరికే ఆ చలిదేశంలో, కొత్త
ఇల్లు కేటాయించేవరకు పాత పెళ్ళాంతోనూ, పాత పెళ్ళాం
కొత్త మొగుడితోను కలసి పాత పెళ్ళాం పాత
ఫ్లాటులో కొన్నాళ్ళపాటు కాలం గడపాల్సిన పరిస్తితి మగవాళ్లది. ఈ దుస్తితి పగవాళ్లకు
కూడా రాకూడదని సరదాగా చెప్పుకునేవారు.
‘మాస్కో రేడియోలో నతాషా అనే సహోద్యోగి ఇరవై లోపే
ఇద్దరికీ విడాకులు ఇచ్చి మూడో మొగుడితో సంసారం చేస్తోంది. మా ఆవిడ శిలావిగ్రహం మాస్కో
పురవీధుల్లో వేయించాలని సరదాగా అంటుండేది. ఎందుకంటే, పెళ్ళయిన పదహారేళ్ళ
తరువాత కూడా ఇంకా అదే మొగుడితో కాపురం
చేస్తున్నందుకట.”
ఇలాటి విశేషాలు తెలుసుకోవాలంటే ‘మార్పుచూసిన
కళ్ళు’ పుస్తకం చదవండి. అలనాటి కమ్యూనిస్ట్ రష్యా చరమాంకం
విశేషాలను అక్షరబద్ధం చేస్తూ సాగిన రచన. ముద్రణ పూర్తయి విడుదలకు సిద్ధంగా వుంది.
ప్రతులకు, వివరాలకు: శ్రీ కె. లక్ష్మణరావు, కార్యదర్శి,
వయోధిక పాత్రికేయ సంఘం, హైదరాబాదు.
ఫోను: 9394712208, Email: lakshmanarao_konda@yahoo.co.in>,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి