కన్ను కొట్టని కరెంటు దీపాలు
‘మేము అక్కడ వున్న అయిదేళ్ళూ కరెంటు
దీపాలు కన్ను కొట్టిన పాపాన పోలేదు. వోల్టేజి సమస్య అంటే అక్కడి వారికి తెలియదు.
‘ఒక నగరం నగరాన్ని, ఆ మాటకు వస్తే, ఒక దేశం దేశాన్ని అందులోను నీళ్ళు
గడ్డకట్టే చలి వాతావరణం కలిగిన దేశాన్ని, ఆ దేశపు జనాన్ని పొత్తిళ్లలో పసిపాపాయిల మాదిరిగా వెచ్చగా
ఏటిపొడుగునా వుంచడాన్ని అక్కడే చూసాము. ఏడాదిలో దాదాపు పది నెలలపాటు మంచు దుప్పటి
కప్పుకుని వుండే మాస్కోలో దుప్పటి అవసరం లేకుండా నిద్ర పోగలగడం అక్కడ మాత్రమే
సాధ్యం. అదీ పైసా (కోపెక్కు) ఖర్చులేకుండా.
‘ఇళ్ళూవాకిళ్ళు, ఆఫీసులు,
ఆవరణలు, బస్సులు,రైళ్ళు,
టాక్సీలు,ట్రాములు,హోటళ్ళు,సినిమా హాళ్ళు, స్కూళ్ళు కాలేజీలు, చివరాఖరుకు స్విమ్మింగ్ పూల్స్ కూడా
ఎయిర్ కండిషన్ అంటే నమ్మ శక్యమా చెప్పండి.’
మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ‘మార్పుచూసిన కళ్ళు’ పుస్తకం చదవండి.
అలనాటి కమ్యూనిస్ట్ రష్యా చరమాంకం విశేషాలను అక్షరబద్ధం చేస్తూ సాగిన రచన. ముద్రణ
పూర్తయి విడుదలకు సిద్ధంగా వుంది. ప్రతులకు, వివరాలకు: శ్రీ
కె. లక్ష్మణరావు, కార్యదర్శి, వయోధిక
పాత్రికేయ సంఘం, హైదరాబాదు. ఫోను: 9394712208, Email: lakshmanarao_konda@yahoo.co.in>,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి