చుండూరు వెంకట రంగారావు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
చుండూరు వెంకట రంగారావు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

13, నవంబర్ 2017, సోమవారం

“ఆకాశవాణి, హైదరాబాదు కేంద్రం, ప్రాంతీయ వార్తలు చదువుతున్నది చుండూరు వెంకట రంగారావు...”


ఈరోజు కార్తీక సోమవారం (13-11-2017) మధ్యాన్నం ఒంటిగంటా పది నిమిషాలకు రేడియోలో ఈ గొంతు వినపడింది. ఈ సాయంత్రం వార్తలు కూడా రంగారావు గారే చదవాలి. కానీ చదవడానికి ఆయన లేరు. సాయంత్రం బులెటిన్ కు సిద్ధం అవుతూ రేడియో స్టేషన్ లోనే కుప్పకూలిపోయారు. న్యూస్ రూమ్ లో పనిచేసే ఇతర సిబ్బంది వెంటనే ఆయన్ని దగ్గరలోని హైదర్ గూడా అపోలో ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. కానీ ఫలితం దక్కలేదు. ఏ వార్తలు అయితే ఆయన చదవాలో ఆ బులెటిన్ లోనే రంగారావు గారి మరణ వార్తను ప్రసారం చేయాల్సి వచ్చిందని న్యూస్ సిబ్బంది బాధ పడ్డారు.
వారి ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలి