13, నవంబర్ 2017, సోమవారం

“ఆకాశవాణి, హైదరాబాదు కేంద్రం, ప్రాంతీయ వార్తలు చదువుతున్నది చుండూరు వెంకట రంగారావు...”


ఈరోజు కార్తీక సోమవారం (13-11-2017) మధ్యాన్నం ఒంటిగంటా పది నిమిషాలకు రేడియోలో ఈ గొంతు వినపడింది. ఈ సాయంత్రం వార్తలు కూడా రంగారావు గారే చదవాలి. కానీ చదవడానికి ఆయన లేరు. సాయంత్రం బులెటిన్ కు సిద్ధం అవుతూ రేడియో స్టేషన్ లోనే కుప్పకూలిపోయారు. న్యూస్ రూమ్ లో పనిచేసే ఇతర సిబ్బంది వెంటనే ఆయన్ని దగ్గరలోని హైదర్ గూడా అపోలో ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. కానీ ఫలితం దక్కలేదు. ఏ వార్తలు అయితే ఆయన చదవాలో ఆ బులెటిన్ లోనే రంగారావు గారి మరణ వార్తను ప్రసారం చేయాల్సి వచ్చిందని న్యూస్ సిబ్బంది బాధ పడ్డారు.
వారి ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలి



2 కామెంట్‌లు:

shadow (antaramgam) చెప్పారు...

అయ్యయ్యో...విధి నిర్వహణలో ..ఇలా అవడం ఆయన నాకు ఏ మాత్రం పరిచయం లేకపోయినా..చాలా బాధనిపిస్తోంది

అజ్ఞాత చెప్పారు...

May his soul rest in peace. --- Legend is given best film award. It should be nominated as India's official entry for Oscar awards.