మూడేళ్ళ క్రితం తిరుపతి వెంకటేశ్వర
స్వామి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఆ యాత్రానుభవాలను గురించి నాడు ‘సూర్య’
దినపత్రికలో రాసిన వ్యాసం నుంచి చిన్న పేరా:
“ తిరుమల గర్భ గుడి నుంచి బయటకు
వచ్చిన తరువాత భక్తుల అసలు కష్టాలు మొదలవుతాయి. అధికారులు, వీ
ఐ పీ లను తీసుకువచ్చి మళ్ళీ తీసుకుపోయే వాహనాలు గుడి దరిదాపుల దాకా వస్తాయి. కానీ సామాన్య
భక్తులు మాత్రం పాదరక్షలతో ఎండలో,
వానలో మాడ వీధులలో తిరుగాడరాదు. ఇందులో తప్పు పట్టేది ఏమీ లేదు. గుడిలోకి
ప్రవేసించే భక్తులు పాదరక్షలు విడిచే ప్రదేశం ఒకటి, బయటకు వచ్చే చోటు మరొకటి. గుడి
బయట పరచిన బండలనండి, ఇంకోటి అనండి వాటిమీద
నడుస్తుంటే అరికాలిమంట నెత్తికెక్కుతుంది. పాలకమండలి సభ్యులు, అధికారులు
ఒక్కటంటే ఒక్కసారి చెప్పులు లేకుండా గుడి చుట్టూ తిరిగివస్తే బాగుంటుంది అని కూడా అనిపిస్తుంది.
అయినా పిల్లి శాపాలకు ఉట్లు రాలవు కదా!
కానీ రాలుతున్నట్టున్నాయి. నిన్న పత్రికలో ఒక వార్త వచ్చింది. కొత్తగా వచ్చిన ఈ ఓ యాత్రీకులకు
ఎండావాన నుంచి కాస్త ఉపశమనం కలిగించడానికి అక్కడ యేవో కదిలే చలవ పందిళ్ళు శాశ్వత
ప్రాతిపదికపై వేయిస్తున్నారని. సంతోషం మూడేళ్ళ తర్వాత అయినా నా గోడు ఏలిన వారి
చెవిన పడినందుకు.
2 కామెంట్‌లు:
"కొందరు ఎక్కువ సమానం" అనే సూత్రమే ఏలుతోంది అన్నిచోట్లా. ఈ సోకాల్డ్ సెలెబ్రిటీ కల్ట్ మరీ పెచ్చుమీరిపోతోంది. విజుయల్ మీడియా కూడా దీనికి బాధ్యులే.
==========
//"కానీ సామాన్య భక్తులు మాత్రం పాదరక్షలు లేకుండా ఎండలో, వానలో మాడ వీధులలో తిరుగాడరాదు."// అన్నారు పైన.
"పాదరక్షలు వేసుకుని" అనుండాలేమో?
@విన్నకోట నరసింహారావు గారు - ధన్యవాదాలు. సరిచేశాను.
కామెంట్‌ను పోస్ట్ చేయండి