నేను టీవీ చర్చలకు వెళ్ళే రోజుల్లో నా మిత్రులు అంటుండేవారు 'నువ్వు తెరమీద కనిపించేది ఎక్కువ, మాట్లాడేది తక్కువ' అని.
యాంకర్ అడిగేవరకూ కల్పించుకుని
మాట్లాడకూడదు అని నాకై నేను పెట్టుకున్న నియమం దానికి కారణం.
పోతే, నాకిది
ఒకరకంగా కలిసి వచ్చింది కూడా. రాజకీయ పార్టీల ప్రతినిధులు చాలా మందిలో విషయ
పరిజ్ఞానం వుంది. కొన్ని అంశాలను గురించి వాళ్ళు చక్కటి హోం వర్క్ చేసుకుని
వచ్చేవారు. అనవసరమైన రాద్ధాంతాలు, వాదోపవాదాల వల్ల అది మరుగునపడేది.
ఎప్పుడైనా వాళ్ళు మంచి విషయాలు చెప్పేటప్పుడు నేను శ్రద్ధగా వినేవాడిని.
అలాగే వ్యవసాయ బిల్లులకు అనుకూలంగా, లేదా
ప్రతికూలంగా మాట్లాడుతున్న వారి నుంచి ఏదైనా మంచి అదనపు సమాచారం తెలుస్తుందేమో అని
చూస్తుంటే నిరాశే మిగులుతోంది. రాజకీయ కోణం మినహాయిస్తే ఇరు పక్షాల వాదనల్లో కూడా
విషయం వుండడం లేదు.
ఫేస్ బుక్ లో కూడా ఇదే పరిస్థితి. ఎవరో
పంపింది హడావిడిగా పోస్ట్ చేసి షేర్ చేయడమే తప్ప స్వంతంగా బిల్లులు చదివి ఆకళింపు
చేసుకున్న దాఖలా కనపడడం లేదు.
ఇదొక
విషాదం!
బిల్లులను
సమర్థిస్తూ , వ్యతిరేకిస్తూ రెండు పెద్ద
మెసేజెస్ నాకు వాట్సప్ లో వచ్చాయి. ఒక్కొక్కటి రెండు పేజీలు అదీ ఇంగ్లీషులో. పైగా
పంపింది ఒక్కరే. అదీ నా స్నేహితుడే.. నాలాగే ఇంగ్లీషులో కాస్త పూర్. మరి ఇంత పెద్ద
మెసేజ్ ఎలా రాసాడని ఆశ్చర్యపోతుంటే రెండోది వచ్చింది.
ఇలా
తన దృష్టికి వచ్చిన ప్రతిదీ కనిపించిన ప్రతివాడికీ ఫార్వార్డ్ చేయడం అతడికి
అలవాటు.
ఈ
షేర్ సింగుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది అని మాత్రం నాకు అర్ధం అయింది.
(మళ్ళీ ఇదే మెసేజ్ అతగాడు
నాకు ఫార్వార్డ్ చేసినా నేను ఆశ్చర్యపోను)
పొతే, ఓ డౌటేహం!
షేరింగ్, కట్
అండ్ పేస్ట్ ఆప్షన్లు తొలగిస్తే రాజకీయ పార్టీల సోషల్ మీడియా యూనిట్ల పరిస్తితి
ఏమిటి?
4 కామెంట్లు:
షేరింగూ, కట్-పేష్టూ నిషేధిస్తే జనం నెత్తిన పాలుపోసినట్లే!
---ఏదైనా మంచి అదనపు సమాచారం తెలుస్తుందేమో అని చూస్తుంటే నిరాశే మిగులుతోంది.
మీ పరిస్థితే ఇలా వుంటే మా లాంటి సామాన్యులకు ఈ బిల్లు లో ఏమి వుందో ఎలా అర్థమవుతుందండీ ? దీనిలో ఏముందో ఎవరైనా వ్రాస్తే చదువుదామని చూస్తున్నా ( దాని పైన అనాలిసిస్ కాకుండా ఓన్లీ అందులో ఏముందో అది మాత్రమే).
జిలేబి
నాదీ అదే భావన.
బ్లాగుల్లో రాస్తే ఎవరూ డబ్బులు ఇవ్వరు కనుక మేధావులు కూడా అనాలిసిస్సే కాదు అసలు బిల్లులో ఏముందో కూడా రాయట్లేదు.
చట్టాలలో ఏముందో చెప్పేస్తే మేధావులకి పని ఉండదేమోగా :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి