చాలా
ఏళ్ళ క్రితం అప్పటి ఉపరాష్ట్రపతి శ్రీ వెంకట్రామన్ హైదరాబాదు వచ్చి రాజ్ భవన్ గెస్ట్ హౌస్
లో మకాం చేశారు. అప్పుడు గవర్నర్ శ్రీమతి కుముద్ బెన్ జోషి. గవర్నర్
కార్యదర్శి గా వున్న కీర్తిశేషులు,
సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారి శ్రీ వి.చంద్ర మౌళిని వెంటబెట్టుకుని కుముద్ బెన్ గెస్ట్ హౌస్ కి వెళ్లి మర్యాదపూర్వంగా ఉపరాష్ట్రపతిని కలిసారు.
మాటల
సందర్భంలో గవర్నర్ కొంత ముభావంగా వుండడం గమనించి శ్రీ వెంకట్రామన్ ‘ఏమిటి అలా
వున్నారు,
ఒంట్లో బాగా లేదా’ అని పరామర్శించారు.
కుముద్
బెన్ అప్పుడు తన మనసు విప్పి ఇలా అన్నారు.
‘ఈ
పత్రికల వాళ్ళు ఉన్నారే, వీళ్ళు ఏ మంచి పనిచేయబోయినా అందులో ఈకలు పీకే ప్రయత్నం
చేస్తారు. మంచి పనిలో చెడు కోణం చూసే వీళ్ళ పద్దతి చూస్తుంటే పొద్దున్నే పేపరు
చదవాలంటే చిరాకుగా ఉంటోంది’
దానికి
వెంకట్రామన్ చిరునవ్వుతో ఇలా జవాబు చెప్పారు.
‘దీనికో
చిట్కా వుంది. ఓ వారంపాటు ఏ పేపరూ చదవకుండా వుండండి. ఎనిమిదో రోజుకల్లా మనసుకు
ప్రశాంతత చిక్కుతుంది’
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి