అసెంబ్లీ
అనగానే గుర్తు వచ్చే పేరు నోముల నరసింహయ్య. ఆయన సభలో మాట్లాడుతుంటే ఆయన నోటి వెంట
సామెతలు అలవోకగా జారుతుండేవి. వామపక్ష
భావజాలం కలిగిన వాళ్ళు చాలామంది మంచి వక్తలు కూడా అయివుండే అవకాశం ఎక్కువ. ఆ
విధంగా నరసింహయ్య గారు మాట్లాడుతున్నారు అంటే ప్రెస్ గేలరీలో విలేకరులు శ్రద్ధగా వినేవారు.
ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో వున్నప్పుడు, తర్వాత టీఆర్ఎస్ లో చేరిన పిదప కూడా ఆయనతో కలిసి అనేక సార్లు టీవీ
చర్చల్లో పాల్గొనే అవకాశం నాకు దొరికింది. మనిషి నిరాడంబరంగా వుండేవారు. మాట కూడా
అంతే!
కరోనాను
జయించిన మనిషి గుండె పోటుకు గురయి మరణించడం విషాదం. ఆయనది మరీ
పెద్ద వయసు కూడా కాదు.
రెండేళ్ల క్రితం టీ న్యూస్ చర్చలో నోముల నరసింహయ్య గారితో...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి