24, ఏప్రిల్ 2020, శుక్రవారం

మల్లాది గారికి క్షమాపణలతో

మల్లాది వేంకట కృష్ణమూర్తి గారు ఇప్పుడే ఫోన్ చేసి తన ఫొటో తీసేయమని చాలా మృదువుగా రిక్వెస్ట్ చేశారు. అందుచేత ఆ పోస్టును, వారి ఫొటోను తీసేస్తున్నాను. వారి మనోభావాలను గౌరవించడం నా విధి. అలాగే ఇప్పటికే ఈ ఫొటోను, పోస్టును షేర్ చేసినవారు ఎవరైనా వుంటే దయచేసి వాటిని తొలగించి మీ అభిమాన రచయిత మనసు గాయపడకుండా చూడండి. ఇది నా విజ్ఞప్తి - భండారు శ్రీనివాసరావు

8 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
విన్నకోట నరసింహా రావు చెప్పారు...

As expected 🙂.
తన ఫొటో గురించి వారికెందుకంత బిడియమో నాకు ఆ నాటికీ ఈ నాటికీ కూడా అర్థం కాదు.
సర్లెండి, వారి ఫొటో వారిష్టం.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

విన్నకోట నరసింహారావు గారికి : నెట్లో వెతగ్గా దొరికిన కారణం, ఆయన మాటల్లోనే:
https://www.youtube.com/watch?feature=youtu.be&v=P_pWiz6Ig64&app=desktop

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

మీరిచ్చిన లింక్ చూశాను శ్రీనివాసరావు గారు, థాంక్స్.
మల్లాది వారు వివరించిన కారణాలు విన్నాను. ఎవరి నమ్మకాలు వారివి 🙏.

Jai Gottimukkala చెప్పారు...

మల్లాది పేరు ఎక్కడో విన్నట్టే ఉంది కానీ పుస్తకాలు ఎప్పుడూ చదువలేదు.

ఇతను వేరే కారణాల మూలాన ఎప్పుడూ వార్తల్లో ఎక్కినట్టు గుర్తు లేదు కనుక పబ్లిక్ ఫిగర్ కాడు. ప్రైవేటు వ్యక్తులకు తమ అస్తిత్వం పట్ల సర్వ హక్కులు ఉంటాయి. ఇతరులు దాన్ని గౌరవించడం కంపల్సరీ.

The right to privacy includes anonymity & the "right to be forgotten".

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

public figure, privacy, anonymity ..... అంతంత భయపెట్టే పెద్దపెద్ద మాటలెందుకులే స్వామీ 😨? ఇది సరదా అయిన ఒక చిన్న విషయం, అంతే. అసలు ఆరోజుల్లో తెలుగు నవలారంగంలో ప్రముఖుడు మల్లాది, సంబంధిత వార్తల్లో వారి పేరు తరచూ వినబడుతూనే ఉండేది, కాబట్టి ఒక రకంగా చూస్తే ఆ మేరకు సాహితీరంగంలో పబ్లిక్ ఫిగరే అనచ్చు. అయినా కూడా నీ ఫొటో చూపిస్తావా లేదా అనీ, "The Nation wants to" see అనీ అలాంటి డిమాండ్లు చెయ్యడం జరగలేదు .... అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూనూ. అంత పేరు, అభిమానులను సంపాదించుకున్న వ్యక్తి తన ఫొటో మాత్రం ఎందుకు దాచుకుంటున్నారు అని ఆసక్తితో కూడిన ప్రశ్న ఒకటి తరచూ తలెత్తుతుండేది ఆరోజుల్లో .... సరదాగా. అంత మాత్రమే. చివరకు వారి ఫొటో, వారిష్టం అనే భావించే వారు జనాలు.

ఇక "right to be forgotten" అంటారా? అప్పటికీ ఇప్పటికీ 40 యేళ్ళు గతించిపోయాయి. దాన్ని గురించి మెల్లిగా మరిచిపోవడమే జరిగింది. The world moves on. అందువల్ల వారి ఆ హక్కుకేమీ భంగం కలగడం లేదు. ఏదో ఇన్నేళ్ళకి ఇప్పుడు భండారు వారు మల్లాది గారి ఫొటో ప్రసక్తి తీసుకొచ్చారు అంతే (unsuccessfully, as it turned out 😀). సరే, భండారు వారిచ్చిన లింక్ వల్ల కలిగిన ఉపయోగం ఏమిటంటే మల్లాది వారికున్న వారి కారణాలేమిటో కొంత మేరకు తెలిసాయి పాఠకులకు, mystery కొంత వీడింది, కుతూహలం కొంత తీరింది.

btw, మీరు మల్లాది వెంకట కృష్ణమూర్తి గారి పుస్తకాలు చదవలేదా? You have missed something, I must say.

Jai Gottimukkala చెప్పారు...

విన్నకోట వారూ, నమస్తే.

Organization is secondary to functionality. ముందు అసలు విషయాలు తేలాకే పండితులు దానికి థియరీలు కడతారు.

పబ్లిక్ ఫిగర్, ప్రైవసీ గట్రా పెద్ద మాటలేవీ కావండీ. అమ్మలక్కలు రాసుకునే చాకలిపద్దును కాస్త అటూఇటూ మార్చి బడ్జెట్ అనే పెద్ద పేరు పెట్టినట్టే, "నా మానాన నేను పడుంటా" అన్నదానికి ప్రైవసీ అనో ముద్దుపేరు.

ఎందరో మహానుభావులు, కొందరే తెలియడం నా తలరాత!

సూర్యప్రకాష్ చెప్పారు...

నాకు కూడా ఈ సందేహం చాలా రోజులనుండి ఉంది.. కాని పూర్తిగా మరచిపోయ్యాను. ఎదో ఇప్పటికి వారి కారణాలు తెలిశాయి. కాలేజ్ రోజుల్లో యండమూరి, మల్లాది గారివి చదవని నొవెల్స్ లేవు.. ఒక్కోటి 2-3 సార్లు చదివిన రోజులు కూడా ఉన్నాయి.