13, ఏప్రిల్ 2020, సోమవారం

కరోనా రోజుల్లో హైదరాబాదు


1970 లేదా అంతకుపూర్వం నుంచి హైదరాబాదులో నివసిస్తూ ఉన్నవారికి, లేదా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి వుంటున్నవారికి నాటి హైదరాబాదు భౌగోళిక వాతావరణ పరిస్తితులు గుర్తుండేవుంటాయి. చాలా ప్రశాంతంగా వుండేది. బస్సులో హైదరాబాదు వస్తుంటే నగర పొలిమేరలకు చేరుతుండగానే కిటికీ చువ్వలు చల్లగా ఐస్ కడ్డీలుగా మారిపోయేవి. నడి వేసవిలో కూడా ఉదయాలు, సాయంత్రాలు చల్లగా, ఆహ్లాదంగా ఉండేవి. తెల్లవారి బాగా పొద్దుపోయే దాకా నగర వీధులు నిశ్శబ్దంగా, జన సంచారం లేకుండా కానవచ్చేవి. అప్పుడప్పుడు అక్కడక్కడ సైకిళ్ళ మీద, రిక్షాలమీద  వెడుతూ కొందరూ, కాలినడకన కొందరూ కనిపించేవారు. కానీ చాలా చాలా అరుదు. ఆ దృశ్యాలు ఆహ్లాదకరంగా ఉండేవి. సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చిన దాకా నగరం బద్ధకం దుప్పటి కప్పుకున్నట్టు నిద్రాణంగా వుండేది. ఏదో పనులమీద, బహుశా ఉస్మానియా యూనివర్సిటీలో పనిపడి కాబోలు  ఒకటి రెండు సార్లు ఆ రోజుల్లో హైదరాబాదు వచ్చిన అనుభవం వుంది. ఇక 1975 నుంచి నా ఆల్ మకాం హైదరాబాదుకే మారింది.
ఇప్పుడు ఈ లాక్ డౌన్ కాలంలో ఆలోచిస్తుంటే నాటి నగర శోభ కనుల ముందు తిరుగుతోంది. నేను బయటకి వెళ్లి చూడగలిగిన, లేదా తిరుగాడగలిగిన అవకాశం వుంటే బహుశా ఆ నాటి నగరాన్ని, నిశ్శబ్దంగా, జన సంచారం, వాహనాల రొద లేని నాటి వీధుల్ని మళ్ళీ ఒకసారి చూడగలిగే అదృష్టం లభించేదేమో! కానీ దురదృష్టం. ఇవన్నీ ఊహలకే పరిమితం చేసుకోవాల్సివస్తోంది. ఎందుకంటే ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన రోజు నుంచి ఈనాటి వరకు నేను  ఇంటిగడప (ఇప్పుడు అన్నీ గడపలు లేని ఇళ్ళే అనుకోండి) దాటి కాలు బయట పెట్టలేదు. అపార్ట్ మెంటు లిఫ్ట్ లో కూడా కాలుమోపలేదు.   

https://www.youtube.com/watch?v=UVH0hoMmMJE    

(LINK COURTESY: విన్నకోట నరసింహారావు గారు)

4 కామెంట్‌లు:

నీహారిక చెప్పారు...

అదృష్టవంతులు, కాలు కదపకుండానే అన్నీ చూసుకునే వారున్నారన్నమాట !

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@నీహారిక: నిజమండీ. ఈవిషయంలో నేను చాలా చాలా అదృష్టవంతుడిని. గత ఆగస్టులో మా ఆవిడ మరణం ఒక్కటే నన్ను మొత్తం ప్రపంచంలో దురదృష్టవంతుడిని చేసింది.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

"కరోనా" లాక్‌డౌన్ రోజుల్లో హైదరాబాద్ రోడ్ల సొగసు ప్రస్తుతానికి ఈ విడియోలో చూసి 👇 .... ఆనందించండి, శ్రీనివాస రావు గారు. నాకు చాలా ఆనందంగా ఉంది. మీరన్నట్లు పాతరోజులు గుర్తొస్తున్నాయి.

కరోనా లాక్‌డౌన్ రోజుల్లో హైదరాబాద్ రోడ్ల సొగసు (drone footage)

Techvlogs చెప్పారు...

Good
https://youtu.be/sAhfLye0bUo