ఆదివారం రాత్రి పద్నాలుగు కుటుంబాల
వాళ్ళం ఒక చోట కలిసాము, లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించకుండానే. ఈ కలయికకు కర్త కర్మ
క్రియ మా అన్నయ్య పెద్ద కోడలు రేణు సుధ. రాత్రి తొమ్మిది గంటలకు మనమంతా
కలుస్తున్నాం, జూమ్ యాప్ సాయంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా’ అని ముందుగానే అన్ని
కుటుంబాలకు వాట్సప్ సమాచారం అందించింది. అమెరికాలో వేర్వేరు చోట్ల ఉంటున్న మా
అన్నయ్య పిల్లలు, మా పెద్దబ్బాయి కుటుంబం, ఖమ్మంలో మూడు కుటుంబాల వాళ్ళు, ముంబైలో
ఉంటున్న ఒక కుటుంబం, హైదరాబాదు సరే సరి మిగిలిన వాళ్ళందరూ రకరకాల
ప్రదేశాల్లో వుంటున్నారు, అందరూ చెప్పిన టైము కల్లా కెమెరాల్లో మొహాలు పెట్టాము. ఒకళ్ళనొకళ్ళం
పలకరించుకున్నాం. మనసారా మాట్లాడుకున్నాం. ఇంతకు ముందు ఇలా ఫోన్ల ద్వారా పలకరింపులు మాకు కొత్తేమీ కాదు, అలాగే వీడియో కాల్స్ కూడా. కానీ
ఇలా అందరం ఒక ఫ్రేములో కలవడం ఇదే మొదటి సారి.
కొసమెరుపు ఏమిటంటే ఏ కరోనా అయితే మమ్మల్నందర్నీ
ఇలా కలిపిందో ఆ కరోనా ముచ్చటే లేదు మా మాటల్లో. దాని ప్రస్తావన లేకుండానే అరగంట
మాట్లాడుకున్నాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి