మా స్వగ్రామం కంభంపాడులో గతకాలపు ముచ్చటగా మిగిలిపోతున్న మా ఇంటి గురించి మా మేనల్లుడు కొలిపాక రాంబాబు స్పందన:
ఓ మహా కుటుంబానికి
ఆకాశ మంత ఆసరా ఇచ్చింది
భూదేవంత భరోసా ఇచ్చింది
ఆ నాల్గు గదుల చావడి
పెత్తనము చేసే పెద్ద హాలు సందడి..
ఇంటి ముందు గూర్ఖాలా
కావలి కాసే విశాలమైన వాకిలి,
ఇంటి వెనుక బుర్కా వేసుకున్నట్టు
బావి పట్టిన మడి నీళ్ల దోసిలి..
ఆ వాకిట్లోకి ఎప్పుడు అడుగు పెట్టినా
ఓ జీవనది లోకి జారుకున్న
పిల్ల చేప లా అయిపోతా,
ఆనందాల ఆనవాళ్లు వెతుక్కుంటూ
ఆ ఇంటి ఒడిలో వాలిపోతా..
ఎన్ని లేలేత పాదాలో
ఆ ఇంటినే బంతిలా ఆడుకున్నాయి
ఎన్ని నూనూగు మీసాలో
అక్కడే మోహన రాగాన్ని పాడుకున్నాయి..
ఇంటి భారాన్నంతా మోసిన దూలానికి
ఊయలను మోయటం ఒక లెక్కా
అందుకే ఎన్ని ఊయలలు ఊగాయో
చూరును అంటిపెట్టుకున్న పిట్టలు
ఎన్ని జోలలు పాడాయో..
ఏకాంతం తెగిపోయిన ఒంటరి మానుపైకి
హఠాత్తుగా వసంతాన్ని వెంటేసుకొచ్చిన
తిరునాళ్ల రోజు హడావుడి..
గుమ్మాలన్నీ గుమిగూడి గుసగుసల సందడి.
ఇంటి నరాలన్నీ నర్తిస్తూ
పాడుకునే షహనాయి రాగాల కచేరి..
దర్జాగా ఠీవిగా ఇంటిముందు
తిష్ట వేసికుర్చున్నట్టు అరుగు
ఆలమందకు పాక అండలా
రాత్రికి మాకది బూరుగు దూది పరుపు..
ఇంటికి వయస్సుడిగిందని అన్నారుట..
మనసున్న ఇంటికి వయసుతో పనేంటి
మహా వట వృక్షం కూలినట్టుగా
పెళ్లలు పెళ్లలు గా రాలిపోయింది
నిన్నటి దాకా కోమా లో ఉన్న ఇల్లు
నేడు జామాయిలు దొడ్డి అయింది
ఇల్లు లేని ఆజాగా చూస్తుంటే
ప్రజలు లేని దేశం తీరులా వుంది..
---- రెబ్బారం రాంబాబు
ఆకాశ మంత ఆసరా ఇచ్చింది
భూదేవంత భరోసా ఇచ్చింది
ఆ నాల్గు గదుల చావడి
పెత్తనము చేసే పెద్ద హాలు సందడి..
ఇంటి ముందు గూర్ఖాలా
కావలి కాసే విశాలమైన వాకిలి,
ఇంటి వెనుక బుర్కా వేసుకున్నట్టు
బావి పట్టిన మడి నీళ్ల దోసిలి..
ఆ వాకిట్లోకి ఎప్పుడు అడుగు పెట్టినా
ఓ జీవనది లోకి జారుకున్న
పిల్ల చేప లా అయిపోతా,
ఆనందాల ఆనవాళ్లు వెతుక్కుంటూ
ఆ ఇంటి ఒడిలో వాలిపోతా..
ఎన్ని లేలేత పాదాలో
ఆ ఇంటినే బంతిలా ఆడుకున్నాయి
ఎన్ని నూనూగు మీసాలో
అక్కడే మోహన రాగాన్ని పాడుకున్నాయి..
ఇంటి భారాన్నంతా మోసిన దూలానికి
ఊయలను మోయటం ఒక లెక్కా
అందుకే ఎన్ని ఊయలలు ఊగాయో
చూరును అంటిపెట్టుకున్న పిట్టలు
ఎన్ని జోలలు పాడాయో..
ఏకాంతం తెగిపోయిన ఒంటరి మానుపైకి
హఠాత్తుగా వసంతాన్ని వెంటేసుకొచ్చిన
తిరునాళ్ల రోజు హడావుడి..
గుమ్మాలన్నీ గుమిగూడి గుసగుసల సందడి.
ఇంటి నరాలన్నీ నర్తిస్తూ
పాడుకునే షహనాయి రాగాల కచేరి..
దర్జాగా ఠీవిగా ఇంటిముందు
తిష్ట వేసికుర్చున్నట్టు అరుగు
ఆలమందకు పాక అండలా
రాత్రికి మాకది బూరుగు దూది పరుపు..
ఇంటికి వయస్సుడిగిందని అన్నారుట..
మనసున్న ఇంటికి వయసుతో పనేంటి
మహా వట వృక్షం కూలినట్టుగా
పెళ్లలు పెళ్లలు గా రాలిపోయింది
నిన్నటి దాకా కోమా లో ఉన్న ఇల్లు
నేడు జామాయిలు దొడ్డి అయింది
ఇల్లు లేని ఆజాగా చూస్తుంటే
ప్రజలు లేని దేశం తీరులా వుంది..
---- రెబ్బారం రాంబాబు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి