31, జనవరి 2019, గురువారం

కూలుతున్న జ్ఞాపకం - రాంపా


కూలిపోతున్న జ్ఞాపకాలు పై ప్రముఖ చిత్రకారుడు, మా మేనకోడలు ఫణి భర్త శ్రీ  రాంపా కవితాత్మక అభిప్రాయం:
ఓ అనుబంధ వేదన – రాంపా
కంభంపాడులో భండారు వారిల్లు హరివిల్లు అయిందే!
ఆ పసిడి పుడమి పవిత్రతలో
తెలుగుతనం ముచ్చట పడే
సృజన మేధస్సులు వికసించినవచట!
నవ్వులు ఆ తోటలో ఆనంద కుసుమాలై
విందుచేయ విరబూసినవచట!
ఆత్మీయతలు, అనురాగాలు, ఆప్యాయతలు
పురుడు పోసుకున్నవచట!
ఆ స్థల విశేషంలో వెలుగు చూసిన హృదయాలు
విశ్వ రంజనలై ఎదచల్లుతున్న వేళ
ఒడిపట్టిన ఆ ఇల్లు !
మనాది పడి తట్టుకోలేక
మీరు లేని నా ఉనికి ఎండుకనుకున్నదో ఏమో!
భూమాతను అమ్మా అని పిలిచిందో ఏమో!
 ఓ కారణజన్మ నిర్యాణంలా
ఓ అవతార సమాప్తిలా ఒరిగిపోతూ స్మృతి అద్దంలో నా ప్రతి బింబాన్ని
చూసుకోండి అంటూ !
తలపులు కన్నీటి జలపాతాలైనా
తిరిగి రానంటూ!!
-      రాంపా    

        

కామెంట్‌లు లేవు: