మొన్నీమధ్య చుట్టాల ఇంట్లో ఫంక్షన్ కు వెళ్లాను. పిల్లలు అంతా ఒకచోట చేరి
మాట్లాడుకుంటున్నారు.
‘మా పవన్ పవరే వేరు. స్టెప్పు వేసాడంటే
దిమ్మతిరిగిపోతుంది. మా హీరో తరవాతే ఎవరయినా.”
‘చెప్పొద్దు పవన్ సంగతి. సినిమా వస్తే
హిట్టో ఫట్టో వెంటనే చెప్పలేము. అదే మా బన్నీని చూడు. చూడకుండానే చెప్పొచ్చు వంద రోజుల బొమ్మని’
‘మీరిద్దరూ కాసేపు గొడవ ఆపుతారా.
ఎప్పుడయినా మా హీరో ప్రభాస్ సినిమా చూసారా. ఫైట్ అంటే మా వాడు చేసేది. మీ వాళ్ళు చేస్తుంటే విలనే
గెలుస్తాడేమో అన్నట్టు నీరసంగా ఏడుస్తుంది’
‘సరేలే. బడాయి. ఫైట్ అంటే మీ హీరోకేం
తెలుసు. ఒక్క చేత్తో పదిమందిని పడుకోబెట్టాలంటే మా ఎన్టీఆర్ కే సాధ్యం. వాళ్ళ
తాతను కూడా మించి పోతున్నాడు తెలుసా’
‘ఇంకా నయం. ఆ మాట గట్టిగా అనకు . ఆ
పెద్దాయనకు వున్న ఫాన్లు అప్పటినుంచి ఇప్పటికీ సాలిడ్ గా అలానే వున్నారు.
విన్నారంటే చావగొట్టి చెవులు మూస్తారు”
ఇలా చాలాసేపు వాళ్ళ వాగ్యుద్ధం
సాగిపోయింది. ఎవరూ ఎవరి మాటా దూరనివ్వరు. వాళ్ళ అభిమాన హీరో మీద ఈగ వాలనివ్వరు.
సరే! సాయంత్రం పెద్దవాళ్ళందరూ ఒక
టేబుల్ మీద చేరారు. ఒకడు చంద్రబాబు పక్షం. మరో డు జగన్ మనిషి. ఇంకోడికి కేసీఆర్ అంటే ప్రాణం. ఇలా ఒక్కొక్కడు ఒక్కొక్క పార్టీ. అంతే అయితే పరవాలేదు. ఒకడికి ఆంధ్రజ్యోతి ఇష్టం, సాక్షిని వేలేసి కూడా ముట్టడు. ఇంకోడు టీ ఛానల్ తప్ప మరో టీవీ పెట్టనుగాక పెట్టడు. మరొకడు సాక్షి పేపరు, టీవీ మినహా
మిగిలినవన్నీ పనికిమాలినవి అని గాఢంగా నమ్మే రకం. పోనీలే, ఎవరి ఇష్టం వారిది
అనుకోవడానికి వీల్లేకుండా సంభాషణ మొదలయింది. భయంకరంగా సాగిపోయింది.
చివరికి అనిపించింది ‘పిల్లలే నయం’ అని.
NOTE: COURTESY IMAGE OWNER
1 కామెంట్:
కులపిచ్చి పచ్చ చానెల్లకంటె, మెచ్యురిటిలెని జగన్ కంటె పిల్లలు కొట్టుకొనేడిదే నయం.
కామెంట్‌ను పోస్ట్ చేయండి